ఆంధ్రప్రదేశ్‌

సిఎం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు 4: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని కస్తూరిదేవి గార్డెన్స్‌లో గురువారం ఏర్పాటు చేసిన యువభేరి కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలన్నారు. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి జాబు ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రాలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి అధికారాన్ని చేజిక్కించుకున్నారని విమర్శించారు. ప్రజలకు ఉద్యోగాల మాట దేవుడెరుగు ఆయనకు మాత్రం జాబు వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావడం ఆంధ్రుల ఖర్మ అని జగన్ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాతో ఎన్నో లాభాలు ఉన్నా దానిని పట్టించుకోకుండా పెట్టుబడుల కోసం విదేశాల చుట్టూ తిరగడం ఎంతవరకు సబబన్నారు. ప్రత్యేక హోదాతో ఎన్ని లాభాలు ఉన్నాయో చంద్రబాబుకూ తెలుసని, కాని ఆయన కేంద్రాన్ని ఎందుకు ఎదిరించి మాట్లాడడం లేదో కూడా ఆయనకే బాగా తెలుసన్నారు. తెలంగాణాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో సిబిఐకి చిక్కడంతో కేంద్రంపై ఆయన ఒత్తిడి తేలేకపోతున్నారు. ఒత్తిడి చేస్తే నరేంద్రమోదీ ఆయన్ను కేసులో ఇరికిస్తారని ఆయన భయం. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఒకరోజు అదేమన్నా సంజీవినా, దాంతో ఒరిగేదేముంది అనడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రాకు అన్యాయం జరిగిందని 5 ఏళ్లు కాదు, కనీసం 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చెప్పిన నాయకులు ఇప్పడు ఆ మాటే మరిచిపోయారని మండిపడ్డారు. ఇప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా తిరుపతిలో జరిగిన సభలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని దానికోసం ఆయన పోరాటం చేస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. హోదా వస్తేనే రాష్ట్రం అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం విద్యార్థులు ముందు కురావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చారు. నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పి అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం.. నెల్లూరు యువభేరి సభలో ప్రసంగిస్తున్న వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి