ఆంధ్రప్రదేశ్‌

పోటెత్తిన పుష్కరఘాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 4: గోదావరి నది వరద ఉద్ధృతి పెరిగింది..గోదావరి ప్రవాహం పెరిగి వడివడిగా సముద్రంలోకి మళ్లుతోంది భక్త జనం అదే ఉరవడిలో అంత్య పుష్కర స్నానాలకు తరలివచ్చారు. అంత్య పుష్కరం గురువారం నాటికి ఐదో రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్ధేశించిన అన్ని ఘాట్లలో సుమారు ఐదు లక్షల మంది వరకు పుష్కర స్నానాలు ఆచరించారు. గురువారం అఖండ గోదావరి నది ఎగువ రాజమహేంద్రవరంలోని స్నాన ఘట్టాల్లోనూ, అఖండ గోదావరి దిగువ స్నాన ఘట్టాల్లోనూ సుమారు 70వేల మంది వరకు పుణ్య స్నానాలు ఆచరించారు. అంత్య పుష్కర ప్రాశస్థ్యంలో శ్రావణ మాసం విశిష్టత కూడా తోడు కావడంతో అత్యధికంగా మహిళలు గ్రామాల వారీగా తరలివచ్చారు. గురువారం అత్యధికంగా హైదరాబాద్, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చెందిన యాత్రికులకే కాకుండా ఒడిస్సాకు చెందిన యాత్రికులు కూడా స్వల్ప సంఖ్యలో వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. వేకువ జామున జిల్లా వ్యాప్తంగా పుణ్య స్నానాలు విశేషంగా ఆచరిస్తుంటే ఎనిమిది గంటల ప్రాంతం నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు అత్యధికంగా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ప్రధానంగా రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్ నిత్యం యాత్రికులతో రద్దీగా ఉంటోంది. పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను సడలించడంతో దాదాపు అన్ని ఘాట్లల వరకు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లలో యాత్రికులు వస్తున్నారు. కోటిలింగాల ఘాట్‌లో అత్యధికంగా పిండ ప్రదాన క్రతువులు నిర్వహించారు. అంత్య పుష్కరాలు మొదటి రోజు నుంచి కూడా పితృకర్మలు అధికంగా నిర్వహించారు. గోదావరి తీరమంతా అంత్య పుష్కరాల సంబరంగానే వుంది. ఎటు చూసినా ఆధ్యాత్మిక కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. కోటిలింగాలఘాట్, పుష్కర ఘాట్, మార్కండేయ, టిటిడి, పద్మావతి, శ్రద్ధానంద ఘాట్, గౌతమీ, సరస్వతి ఘాట్‌లలో, ధవళేశ్వరం రామపాదాల రేవు, అప్పనపల్లి, అంతర్వేది, కోటిపల్లి, అయినవిల్లి తొగరపాయ, రావులపాలెం, వాడపల్లిలలో అత్యధికంగా పుష్కర స్నానాలు ఆచరించారు.గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టం బాగా పెరుగుతుండటంతో దిగువకు ధవళేశ్వరం బ్యారేజి నుంచి అన్ని గేట్లు ఎత్తి వేసి వరద జలాలను సముద్రంలోకి విడిచిపెడుతూ స్నాన ఘట్టాల వద్ద స్నానాలు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు.
ప.గో. జిల్లాలో
కొవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో అంత్య పుష్కరాలు అయిదవ రోజు గురువారం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి వరద గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుఝాము నుండీ భక్తులు తొలుత తక్కువ సంఖ్యలో వచ్చినా క్రమేణా భక్తుల తాకిడి పెరుగుతూ వచ్చింది. గోదావరికి వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోష్పాద క్షేత్రంలోని స్నాన ఘట్టంలో మెట్లపైకి వరద నీరు రావడంతో భక్తులు చెంబులతో నీళ్లుపోసుకుని స్నానమాచరించారు. పిండ ప్రదాన క్రతువులు అధికంగా నిర్వహించారు.
భ ద్రాచలంలో ..
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి పాదాలను తాకుతూ ప్రవహిస్తున్న గోదావరికి పుష్కర భక్తుల తాకిడి పెరిగింది. జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు మండలం మోతె, మణుగూరు, వెంకటాపురం మండలంలోని రామచంద్రాపురం వద్ద స్నానఘట్టాల్లో భక్తులు పెద్ద ఎత్తున పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. శ్రావణమాసం ప్రారంభం కావడంతో గురువారం మహిళలు అధిక సంఖ్యలో పుష్కర పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.రు. శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో వాసింగ్టన్‌లో ఉంటున్న చెన్నైకు చెందిన భక్తుడు ఒకరు స్వామి వారి దర్బారు సేవకు రూ.10లక్షల విలువ చేసే దర్బారు బంగారు కిరీటాన్ని, రూ.2లక్షల విలువ చేసే పగడాల హారాన్ని బహూకరించారు.

చిత్రం.. రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు