ఆంధ్రప్రదేశ్‌

వాల్తేరు డివిజన్‌లో తొలి మహిళా గూడ్స్ గార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 4: ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ పరిధిలో ప్రప్రథమంగా మహిళ తొలిసారిగా గూడ్స్ గార్డుగా విధుల్లో చేరి వార్తల్లో నిలిచారు. విశాఖ మర్రిపాలెం మార్షలింగ్ యార్డు నుంచి రాయగడకు వెళ్ళే గూడ్స్‌రైలులో ఆమె గార్డుగా గురువారం విధులు ప్రారంభించారు. యుహెచ్ లక్ష్మి గూడ్స్ గార్డుగా అర్హత పొంది డిపార్ట్‌మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణురాలైన ఈమె 2015 నవంబర్‌లో ఎస్‌ఐఎన్‌ఐ, జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందింది. రైల్వేలో పనిచేస్తున్న భర్త చనిపోవడంతో ఆ ఉద్యోగాన్ని ఈమెకు ఇవ్వగా 2011లో వాల్తేరు డివిజన్‌లో ట్రైనీ క్లర్క్‌గా ఉద్యోగంలో చేరింది. కాగా ఇప్పటివరకు ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోన్ పరిధిలోకి వచ్చే సంబల్‌పూర్, ఖుర్దా, వాల్తేరు డివిజన్ పరిధిల్లో మహిళా గూడ్స్ గార్డుగా ఏ ఒక్కరూ విధులు నిర్వహించ లేదు. తొలిసారి ఆ ఘనతను దక్కించుకున్న లక్ష్మిని రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.

చిత్రం.. గూడ్స్‌రైలులో విధి నిర్వహణలో యుహెచ్ లక్ష్మి