ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాల్లో సమర్థత నిరూపించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 4: పుష్కరాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించి సమర్థత నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లా కలెక్టర్లు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. యాత్రికుల సేవకు, ప్రజా సేవకు కృష్ణా పుష్కరాలు ఒక అవకాశం అని అన్నారు. ఎక్కడా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని ఆయన అధికారులను కోరారు. పుష్కర పనులను అధికారులు అంకిత భావంతో నిర్వహించాలని సూచించారు. ఘాట్‌ల వద్ద బారికేడింగ్ పగడ్బందీగా ఉండాలని చెప్పారు. ఘాట్‌లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలని, సుందరీకరణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఘాట్‌ల వద్ద సంచార వైద్యశాలలు ఏర్పాటు చేయాలని, అత్యవసర మందులు, వైద్యం అందుబాటులో ఉంచాలని సూచించారు. వసతులు, సదుపాయాలపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇవ్వాలని, వీటిపై ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆయన సూచించారు.