ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రం కోసం ధర్మపోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రం కోసమే ధర్మపోరాటం చేస్తున్నామని, ధర్మాన్ని మనం కాపాడితే, ధర్మమే తిరిగి మనల్ని కాపాడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఉండవల్లి ప్రజావేదికలో ప్రవాసాంధ్రులతో బుధవారం రాత్రి ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది టీడీపీకి, రాష్ట్రానికి చెడు చేయాలని చూసినా ప్రకృతి కలిసి వచ్చిందన్నారు.
జన్మభూమి-మా ఊరు, స్మార్ట్ వార్డు, స్మార్ట్ గ్రామం తదితర కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు కీలక భూమిక పోషించారన్నారు. ఇంతకు రెట్టింపు స్ఫూర్తితో మరింతగా రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జన్మభూమి రుణం తీర్చుకోవాలని, జీడీపీ అభివృద్ధికి ప్రతిభ, కష్టం తోడ్పాడలని కోరారు. నాలెడ్జ్ ఎకనామిలో పైచేయి కావాలని, ఏపీ ఇన్నోవేషన్ హబ్‌గా మారాలన్నారు.
10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు. ప్రపంచంలో తెలుగుజాతి సాటిలేని మేటిగా ఎదగాలని, తెలుగుజాతి గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలన్నారు. రాష్ట్రంలో 2 కోట్ల ఎకరాలకు నీళ్లు ఇచ్చే విధంగా జలవనరులు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. ఆరోగ్యకర పంటలకు చిరునామాగా ఏపీ తయారు కావాలన్నారు. పంచ నదులు అనసంధానం చేస్తున్నామని, విభజన సమస్యలను పట్టుదలతో అధిగమిస్తున్నామన్నారు. 13 జిల్లాల్లో సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. విదేశాల నుంచి పెట్టుబడులను రాబట్టామని, 150 దేశాల్లో 25లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారన్నారు. వీరంతా రాష్ట్భ్రావృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రవాసాంధ్రుల చొరవ, కష్టం ఉపయోగపడిందని, ప్రజలంతా తమను ఆమోదించారని, మళ్లే తననే సీఎం రావాలని కోరుకుంటున్నారన్నారు.