ఆంధ్రప్రదేశ్‌

వేతనాల చెల్లింపులో జాప్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 4: ఉపాధి హామీ పథకం కింద వేతనదారులకు త్వరగా వేతనాలు చెల్లించడం ద్వారానే ఆ పథకం లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అపరాజితా సారంగి తెలిపారు. వేతనాల చెల్లింపుల్లో జాప్యం వద్దని అధికారులను ఆదేశించారు. మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై 3వ అంతరాష్ట్ర అవగాహన సదస్సును ఆమె విశాఖలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె 11 రాష్ట్రాల నుంచి హాజరైన అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ పథకం దేశంలో 661 జిల్లాల్లో అమలు చేస్తున్నామని, 12 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు వెల్లడించారు. వేతనాల చెల్లింపులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాలు ముందున్నాయన్నారు. ఆ రాష్ట్రాల్లో అమలు జరుగుతుండగా మిగిలిన రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో 93 శాతం మేరకు 15 రోజుల్లో వేతనాలు చెల్లిస్తున్నారని, ఇది ఏలా సాధ్యమైందన్న విషయాన్ని ఇతర రాష్ట్రాల అధికారులు తెలుసుకుని అమలు చేయాలని ఆదేశించారు. వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్న రాష్ట్రాల ఉన్నతాధికారులతో మాట్లాడతానని, ఈ మేరకు వారు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సులో ఆంధ్రప్రదేశ్‌లో అమలు జరుగుతున్న ఉత్తమ విధానాలు తెలుసుకోవాలని, వాటిని అమలు చేసేందుకు వీలుగా రోడ్ మ్యాప్‌ను 15 రోజుల్లో రూపొందించుకోవాలన్నారు.
ప్రతి వేతనదారు వివరాలను పర్యవేక్షించేలా ఉండాలని, జాబ్ కార్డు, ఫొటో అప్‌లోడ్, రికార్డుల నిర్వహణ, జియో ట్యాగింగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పెండింగ్‌లో పనులు ఉంటే కొత్తగా నిధులు కేటాయించరని, 2015-16 సంవత్సరం ఉపాధి పనులకు స్వర్ణయుగమని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి కమిషనర్ రామాంజనేయులు మాట్లాడుతూ ఈ పథకం విజయవంతంలో కలెక్టర్ల పాత్ర కీలకమన్నారు. సాంకేతికను అందిపుచ్చుకుని పారదర్శకంగా చెల్లింపులు, పనులు చేపట్టడం వల్ల అవార్డు అందుకున్నామన్నారు.

చిత్రం.. అపరాజితా సారంగి