ఆంధ్రప్రదేశ్‌

సమాచార కమిషనర్‌గా ఐలాపురం రాజా ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 15: రాష్ట్ర సమాచార కమిషనర్‌గా ఐలాపురం రాజా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలోని మొదటి బ్లాకులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమాచార కమిషనర్‌గా ఐలాపురం రాజాతో ప్రమాణ స్వీకారం చేయించారు. సమాచార హక్కు చట్టం అమలులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు కమిషనర్లను నియమించగా ఇటీవల మరో కమిషనర్‌గా ఐలాపురం రాజాను నియమించింది. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార కమిషన్‌కు వస్తున్న ఫిర్యాదులు తదితర అంశాలపై సీఎస్ ఆరా తీశారు. ఏఏ శాఖలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయో ఆయా శాఖలకు సంబంధించి ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించాలని ఆయన కమిషనర్లకు సూచించారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పథకాలు, కార్యక్రమాలు, ప్రభుత్వ సహాయంతో నడిచే అన్ని రకాల విభాగాలకు చెందిన కార్యకలాపాల అమలుకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రజలు తెల్సుకోవాల్సిన ఆవశ్యకత ఉందని, అదే ఈ చట్టం ముఖ్య ఆశయమని సీఎస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, సమాచార కమిషనర్లు ఎం రవికుమార్, కే జనార్ధన్, ఐలాపురం రాజా కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.