ఆంధ్రప్రదేశ్‌

ఈసీ పక్షపాత వైఖరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 15: రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 49 కేంద్రాల్లో అక్రమాలు జరిగితే ఎన్నికల సంఘం పక్షపాత వైఖరితో ఇష్టారాజ్యంగా వ్యవహరించటం సమంజసంకాదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళావెంకట్రావ్ నిరసన వ్యక్తం చేశారు. బుధవారం సచివాలయంలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధానాధికారి సుజాతశర్మను కలిసి ఈ 49 కేంద్రాల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించిందంటూ, నియోజకవర్గంలోని 166,310 పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయని టీడీపీ చేసిన ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పోలింగ్ రోజునే టీడీపీ అభ్యర్థి నానీ.. ఈసీకి పరిస్థితిని వివరించారని గుర్తుచేశారు.
పోలింగ్ ముగిసిన 24 రోజుల తరువాత వైసీపీ అభ్యర్థి కొన్ని బూత్‌లపై ఫిర్యాదు చేస్తే సీఈఒ విచారణకు ఆదేశించటం మంచి సాంప్రదాయం కాదన్నారు. రాష్ట్రంలో ఈనెల 6వ తేదీన ఒకవిడత రీపోలింగ్ నిర్వహించారని ఇప్పుడు కొత్తగా విచారణ జరిపి మరోసారి రీపోలింగ్‌కు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం అధికారులు పారదర్శకంగా వ్యవహరించటం లేదని ఆక్షేపించారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించటం ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమన్నారు. చంద్రగిరిలో రీపోలింగ్‌కు నిర్ణయించటంతో ఎన్నికల అధికారుల పనితీరును శంకించాల్సి వస్తోందన్నారు. అక్రమాలు జరిగిన అన్ని కేంద్రాల్లో విచారణ జరిపి రీపోలింగ్ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సుజాత శర్మ స్పందిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది ప్రస్తుతం సెలవులో ఉన్నారని ఆయన విధులకు హాజరైన అనంతరం పరిస్థితిని వివరిస్తామన్నారు. టీడీపీ డిమాండ్ చేస్తున్న కేంద్రాల్లో కూడా రీపోలింగ్ జరపాలని కళా వెంకట్రావ్ సుజాతశర్మకు వినతిపత్రం సమర్పించారు.
చిత్రం... రాష్ట్ర అదనపు ఎన్నికల ప్రధాన అధికారి సుజాతశర్మకు వినతిపత్రం అందజేస్తున్న
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు