ఆంధ్రప్రదేశ్‌

మున్సిపాలిటీల్లో భూగర్భ కేబుల్ ద్వారా విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 3: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో భూగర్భ కేబుల్ ద్వారా విద్యుత్ సౌకర్యం అందజేయడానికి తమ కమిషన్ మున్సిపల్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిందని రాష్ట్ర శాసనసభ ప్రభుత్వరంగ సంస్థల కమిటీ చైర్మన్ కాగిత వెంకటరావు తెలిపారు. గురువారం పద్మావతి అతిథిగృహంలో టిటిడి ఇఓ సాంబశివరావు, ఎస్‌పిడిసిఎల్ డైరెక్టర్ పుల్లారెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల ఎండి కె.రామ్‌గోపాల్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా అందించడంలో ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. టిటిడి అన్ని విభాగాలలో ఎల్‌ఇడి బల్బులతో విద్యుత్ సరఫరా చేయడానికి ఈరోజు కమిటీ ముందు టిటిడి అధికారులు ఆమోదించారని తెలిపారు.ఖాళీగా ఉన్న జూనియర్ లైన్‌మెన్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వానికి నివేదికలు అందజేసినట్లు ఎస్‌పిడిసిఎల్ ఉన్నతాధికారులు వెల్లడించారు.