ఆంధ్రప్రదేశ్‌

కౌంటింగ్ తర్వాత కూడా రీ పోలింగ్ జరుపుతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 16: కేంద్ర ఎన్నికల కమిషన్ తీరు, నిర్ణయాలు చూస్తుంటే మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత కూడా దేశంలో రీ పోలింగ్ జరుపుతుందేమో అని అనుమానం కలుగుతోందని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ ఎద్దేవా చేశారు. ఆంధ్రరత్నభవన్‌లో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్‌కు ఆదేశించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని, ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగితే, మే 16న అంటే 35 రోజుల తరువాత రీ పోలింగ్‌కు ఆదేశించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. మధ్యలో కొన్ని చోట్ల రీ పోలింగ్ కూడా జరిగిపోయిందని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఒక రోజు ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని నిలుపు చేస్తూ ఎన్నికల కమిషన్ అసాధారణ నిర్ణయం ప్రకటించడాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు కావడం కోసం రాష్ట్రంలోని తెలుగుదేశం, వైకాపాలు రాహుల్‌గాంధీని ప్రధానిని చేసే దిశగా స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి డా గంగాధర్ మాట్లాడుతూ జర్మనీ నియంత హిట్లర్ ప్రభుత్వం 1945, మే 23న కూలిపోయిందని, అదే తేదీన మోదీ ప్రభుత్వానికి కూడా ఆఖరి రోజు కావడం యాదృచ్ఛికమని అన్నారు. కేంద్రంలో కచ్చితంగా కాంగ్రెస్ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.