ఆంధ్రప్రదేశ్‌

హోదా ఆంధ్రుల హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 4: ప్రత్యేక హోదా కోసం ఎవరినీ యాచించనవసరం లేదని, అది ఎపి ప్రజల హక్కు అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ అజీజ్ పాషా, జల్లి విల్సన్, జి ఓబులేసు, తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డిలతో కల్సి విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఎపిలో అందరూ ప్రత్యేక హోదాపై ఏం జరుగుతుందోనని ఢిల్లీవైపు చూస్తున్నారని నారాయణ అన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ప్రకటించగా, ఆనాటి ప్రతిపక్ష నేత వెంకయ్యనాయుడు 10 ఏళ్లు కావాలని డిమాండ్ చేశారన్నారు. అంతేగాక తన వల్లే ఎపికి ప్రత్యేక హోదా వచ్చిందని ఊరూరా ప్రచారం, సన్మానాలు చేయించుకోవడం, బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాలను ఆయన వివరించారు. రెండేళ్లుగా దీనిని అమలు చేయకపోగా, హోదా విభజన బిల్లులో పేర్కొనలేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మళ్లీ ఇప్పుడు ప్యాకేజీ అంటూ కొత్త పాట పాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదాను యాచించడం లేదు, అది ఎపి హక్కు అన్న విషయం కేంద్రం గుర్తెరగాలని నారాయణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నాటకాలకు తెరదించాలని, ఢిల్లీ వెళ్లి ఒంటరిగా ప్రధానిని కలవకుండా పార్లమెంటులో మద్దతు తెలిపిన 11 మంది పార్టీల నేతలతో వెళ్లి ప్రత్యేక హోదాపై ప్రకటన చేయించాలన్నారు. అది ఆయన రాజకీయ బాధ్యతగా నారాయణ పేర్కొన్నారు. అలాగాకుండా మళ్లీ ఆయన ఒక్కరే వెళ్లి ప్రధానితో గుసగుసలాడితే జనం ఇద్దర్ని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రత్యేక హోదా అంశం చంద్రబాబు సొత్తు కాదని, అది రాష్ట్ర, ప్రజా సమస్య అన్నారు. ఢిల్లీ వెళ్లి ప్రత్యేక హోదా సాధించుకొస్తే మేమే సన్మానం చేస్తామన్నారు. అన్ని రంగాల్లో కేంద్రం ఘోర వైఫల్యం చెందిందని నారాయణ విమర్శించారు. ప్రభుత్వ విధానాలు కార్పొరేట్లకు, వ్యాపారులకు అనుకూలంగా ఉన్నాయని, ఫలితంగా నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయన్నారు. దీనిపై ఈ నెల 17న దేశవ్యాప్తంగా సిపిఐ ఆందోళన చేపడుతున్నట్లు చెప్పారు.