ఆంధ్రప్రదేశ్‌

ఎగ్జిట్ పోల్స్‌పై ఎడతెగని ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మే 18: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో నాలుగు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తుది విడత ఎన్నికలు ఆదివారంతో ముగియనుండటంతో వెంటనే వెలువడనున్న ఎగ్జిట్‌పోల్స్ సర్వేపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికలకు ముందే విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తన అంచనాలను ప్రకటించటంతో రాజకీయ పార్టీల్లో కలకలం రేగుతోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ వైపే ఓటర్లు మొగ్గుచూపారని ఇది తన అంచనా మాత్రమే అని లగడపాటి ప్రకటించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒకింత నూతనోత్సాహం పెరిగింది. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం లగడపాటి అంచనాను తప్పుపడుతోంది. తెలంగాణలో శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా లగడపార్టీ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయని ఏపీలో కూడా అదే తరహాలో ఉంటుందనే ధీమాను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలో తన సర్వే ఎందుకు తారుమారైందనే విషయాన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వే సందర్భంగా వెల్లడిస్తానని లగడపాటి చెప్తున్నారు. అయితే లగడపాటి సర్వేలు పలు సందర్భాల్లో తప్పని తేలాయి. 2016 మే నెలలో తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే భారీ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని సర్వేలో వెల్లడించారు.
అయితే ఆ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకు 134 సీట్లు రాగా, డీఎంకే 89 స్థానాలతోనే సరిపెట్టుకుంది. గతేడాది మేలో కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందని అన్ని సర్వేలు నిగ్గుతేల్చగా లగడపాటి సర్వేలో మాత్రం బీజేపీకి తిరుగులేని మెజారిటీ వస్తుందని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఫలితాలు తారుమారై హంగ్ ఏర్పడటంతో పాటు కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక తెలంగాణలో కూడా ఇదే తరహా ఫలితాల్లో మార్పులు జరిగాయి. అయితే ఏపీలో జరిగిన ఎన్నికల్లో కచ్చితమైన సర్వేను అందించటం ద్వారా విశ్వసనీయత చాటుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. లగడపాటి సర్వేపై నిజానిజాలు ఈనెల 23న తేలాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ధీమాతో పెద్దఎత్తున బెట్టింగ్‌లు జరిగాయి. లగడపాటి సంకేతాలతో బెట్టింగ్ రాయుళ్లలో టెన్షన్ మొదలైంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో బెట్టింగ్‌లు వినూత్న రీతిలో సాగుతున్నాయి. నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మాచర్ల, సత్తెనపల్లి, నరసరావుపేట శాసనసభ స్థానాల్లో ఏ ఒక్క స్థానంలో వైసీపీ పరాజయం పొందినా బెట్టింగ్ సొమ్ము వదిలేసుకుంటామని కొందరు పందేలు కాస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా టీడీపీ, వైసీపీ, జనసేనకు రాష్ట్రం మొత్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయమై జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కేంద్రంలో ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వాల ఏర్పాటుపై కూడా కోట్లలో లావాదేవీలు జరుగుతున్నాయి. అంతేకాదు కొందరు రాజధానిలో ప్లాట్లను కూడా బెట్టింగ్‌కు నిలిపారంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.