ఆంధ్రప్రదేశ్‌

అది సనాతన విలువలకు దక్కిన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 19: ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన శాంతి విశ్వవిద్యాలయం నుండి అందిన గౌరవ డాక్టరేట్ వసుధైక కుటుంబమనే భారతీయ భావనకు, సనాతన విలువలైన శాంతి, సమతలను ఆకాంక్షిస్తున్న దేశానికి, నాగరికతకు, సంస్కృతికి ఇచ్చిన గౌరవం తప్ప తనకు వ్యక్తిగతంగా లభించినది కాదని ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న అనంతరం ఆదివారం తొలిసారిగా ఆయన గుంటూరు వచ్చారు. ఈసందర్భంగా గుంటూరు క్లబ్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ 47 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఐదేళ్లు విద్యార్థి దశలో, 42 సంవత్సరాలు రాజకీయాల్లో రాణించానని, ఎమర్జన్సీ కాలంలో తాను జైలుకు కూడా వెళ్లానని గుర్తుచేశారు. గుంటూరులో పాత మిత్రులను కలవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఉప రాష్టప్రతిగా ఎన్నికైన తర్వాత తాను ఐదు రంగాలను ఎంచుకున్నానని, దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పర్యటించి విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కావడం ప్రధానమైనదని తెలిపారు. దేశంలోని అన్ని టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లను సందర్శించడం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లలో పర్యటించటం, దేశానికి వెనె్నముక అయిన రైతులను కలిసి వారి ఆలోచనలు, విధానాలు తెలుసుకోవడం, దేశంలో ప్రజాజీవనం కేవలం ఉద్యోగం, ఆస్తి, సంపాదనకే కాకుండా స్వేచ్ఛతో పాటు 64 కళలను ప్రోత్సహించటం కీలకమైనవని చెప్పారు. మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తి కనబర్చడం శుభ పరిణామమన్నారు. ప్రపంచ అభివృద్ధి రేటు 3శాతంగా ఉంటే భారత్‌లో మాత్రం అది 7శాతంగా ఉందన్నారు. 70ఏళ్లకు రాజకీయాల్లో రిటైరై సమాజ సేవ చేస్తుండాలని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు.
అనంతరం గుంటూరు క్లబ్ పాలకవర్గం ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం, విజ్ఞాన్ విద్యాసంస్థల మాజీ డైరెక్టర్ పాతూరి కోటేశ్వరరావు, జమ్ముల శ్యామ్‌కిషోర్, యడ్లపాటి రఘునాథబాబు, చుక్కపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.