ఆంధ్రప్రదేశ్‌

సాగునీటికి ఢోకా ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 6: రాష్ట్రంలోని రైతులకు సాగునీటి రక్షణ కల్పించడానికి నిరంతరం శ్రమిస్తున్నామని, లోటు బడ్జెట్ ఉన్నా ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. కర్నూలులో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేశామన్నారు. శ్రీశైలం జలాశయానికి భారీ ఎత్తున వరద రావడంతో దిగువకు నీటిని విడుదల చేయకుండా పోతిరెడ్డిపాడు, హంద్రీ-నీవాకు వెయ్యి క్యూసెక్కులు చొప్పున విడుదలకు ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. వీలైనంత త్వరలో హంద్రీ-నీవా రెండవ దశ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఆయన ఆదేశాల మేరకు పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కోర్టులో పిటిషన్ వేయించి స్టే తీసుకువచ్చారని స్పష్టం చేశారు. దానిపై కోర్టులో వాదనలు వినిపించి స్టే ఎత్తివేయించామని, ఇక పనులు వేగం పుంచుకుంటాయన్నారు. ఉత్తరాంధ్రలోని వంశధార ఫేజ్-1, ఫేజ్-2 పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నామన్నారు. 30 కిలోమీటర్ల కాలువ తవ్వడం ద్వారా నాగావళి నదిని అనుసంధానం చేసే ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఇది పూర్తయితే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లక్ష హెక్టార్లకు సాగు , తాగునీరు అందించడమే గాక విశాఖపట్టణం నగరవాసుల దాహార్తి తీరుస్తామని స్పష్టం చేశారు. వంశధార ప్రాజెక్టు పూర్తి చేయడానికి రైతులను బతిమిలాడి వారు కోరుకున్న సొమ్ము చెల్లించి పనులు పూర్తి చేశామని వివరించారు. పట్టిసీమ ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకు 6.30 టిఎంసిల గోదావరి జలాలను తరలించామన్నారు.