ఆంధ్రప్రదేశ్‌

ఎసిబి వలలో సబ్ రిజిస్ట్రార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), ఆగస్టు 6: భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన అధికారి ఎసిబి పన్నిన వలలో చిక్కిన సంఘటన శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలివి. జిల్లాలోని డెంకాడ మండలం బడ్డుకొండపేట గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి మూడున్నర ఎకరాల భూమిని గ్రామస్తులు నుండి కొనుగోలు చేశారు. ఈభూమి విలువ సుమారు 80లక్షల రూ.లు. భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు దాసన్నపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళారు. బూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటే 40వేల రూ.లు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ పెంటకోట భవానీ డిమాండ్ చేశారు. డాక్యుమెంట్ రైటర్‌గా ఉన్న శ్రీనివాసరావును మధ్యవర్తిగా ఇందుకు సబ్ రిజిస్ట్రార్ ఏర్పాటుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితుడు రామకృష్ణ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. మధ్యవర్తి ద్వారా ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు సబ్ రిజిస్ట్రార్ భవానీ అడిగిన మొత్తం 40వేల రూపాయలను శనివారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అందిస్తుండగా ఎసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎసిబి అధికారులు సబ్ రిజిస్ట్రార్ భవానీ, మధ్యవర్తి శ్రీనివాసరావులమీద కేసు నమోదుచేశారు. లంచంగా డిమాండ్ చేసిన 40వేలను స్వాధీనం చేసుకున్నారు.