ఆంధ్రప్రదేశ్‌

వర్శిటీల్లో బయోమెట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఆగస్టు 6: రాష్టవ్య్రాప్తంగా యూనివర్సిటీల పరిధిలో ఖాళీగా ఉన్న 1104 అధ్యాపకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్రంలోని అన్ని వర్శిటీల ఉపకులపతుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామి రాష్ట్రంగా నిలపడమే ధ్యేయమన్నారు. ఓ ప్రణాళికతో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రాధాన్యతా పరంగా కొత్త యూనివర్సిటీలకు నిధులును కేటాయిస్తామన్నారు. రూ.303 కోట్ల నిధులను అన్ని యూనివర్సీటీలకు పంపనున్నట్లు తెలిపారు. విద్యారంగానికి రూ.21 వేల కోట్లు కేటాయించామన్నారు. రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో వౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుండి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలలో విద్యార్థులు, ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు శాతాన్ని బట్టి చెల్లిస్తామన్నారు. రాష్టవ్య్రాప్తంగా ఒకే అకడమిక్ క్యాలెండర్ అమలు చేస్తామని గంటా తెలిపారు. ప్రతి యూనివర్సిటీలో స్కిల్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి దాని ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గతానికి భిన్నంగా వర్శిటీల పాలకమండళ్లలో ఇద్దరు పారిశ్రామికవేత్తలను నియమించామని తెలిపారు. ఇది ఒకరకంగా పరిశ్రమలకు యూనివర్సిటీని అనుసంధానం చేయడమేనని అన్నారు. ఆయా యూనివర్సిటీ ఉపకులపతులు పోటాపోటీగా అభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. త్వరలో జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఈనెల 10న సిఎం అధ్యక్షతన ఉన్నత విద్యామండలి సమావేశంలో చర్చించి వీటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సంవత్సరం నుంచే 4 వేల పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఉపాధ్యాయుల రేషనలైజేషన్ జరుగుతోందని, దాని ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. తద్వారా ఏపిని డిజిటల్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. ఉన్నత విద్యామండలి ఛైర్మెన్ ఆచార్య వేణుగోపాల్‌రెడ్డి, కార్యదర్శి జయప్రకాష్, ఎస్కేయూ విసి రాజగోపాల్, జెఎన్‌టియూ విసి ఆచార్య సర్కార్, 15 యూనివర్సిటీల ఉపకులపతులు పాల్గొన్నారు.

చిత్రం.. అనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి గంటా