ఆంధ్రప్రదేశ్‌

లాభసాటి వ్యవసాయం లక్ష్యం: సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఆగస్టు 6: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుడంతో పాటు, రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్యను సిఎం ప్రారంభించారు. వర్షం నీటిని ఒడిసి పట్టేందుకు చేపట్టిన సంజీవనితో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర అందక, పెట్టిన పెట్టుబడులు రాక చివరకు రైతులుఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో మొదటిసారి రైతు పండించిన పంటను తానే మార్కెటింగ్ చేసేకునే విధంగా టెక్నాలజీని అనుసంధానం చేశామన్నారు. పండ్లతోటల రైతులను అదుకునేందుకు జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో ఉత్పత్తిదారుల సమాఖ్య ప్రారంభానికి 42 కంపెనీల ప్రతినిధులు ముందుకు వచ్చారని, అందులో 12 కంపెనీలు పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు చేసుకున్నామన్నారు. జిల్లా రైతులు పండించిన బత్తాయి, బొప్పాయి, నిమ్మ, టమోటా, మిరప దేశీయ మార్కెట్‌కు వెళ్తున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు విద్యుత్ అందించడం, ఇంటర్‌నెట్‌తో టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి పరిశ్రమలకు అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రపత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు, ఎంపి దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

చిత్రం..బుక్కరాయసముద్రంలో ఓ కార్యక్రమంలో విదేశీ కంపెనీలతో ఎంఓయు
కుదుర్చుకున్న సందర్భంగా పత్రాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు