ఆంధ్రప్రదేశ్‌

పోటెత్తిన భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 6: గోదావరి నది అంత్య పుష్కరాలు ఏడవ రోజైన శనివారం భక్తులు అత్యధికంగా పుణ్య స్నానాలు ఆచరించారు. శ్రావణ మాస ప్రాశస్థ్యం కూడా తోడవ్వడంతో రద్దీ పెరిగింది. మరో వైపు గోదావరి నది వరద ఉద్ధృతి కూడా పెరుగుతోంది. అఖండ గోదావరి నదిలో సుమారు 71వేల మంది శనివారం పుణ్య స్నానాలు ఆచరించారు. పుష్కర ఘాట్ భక్తులతో పోటెత్తింది. వరద జలాలు ఔషధ లక్షణాలు కలిగివుండటంతో పుష్కర స్నానం మరింత ప్రాశస్త్యం సంతరించుకుందని మైకుల్లో ప్రచారం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తజనం పుణ్య స్నానం ఆచరించి తరించారు. సకుటుంబ సపరివారంగా అంత్య పుష్కర స్నానాలకు రాష్ట్రంలో పలు జిల్లాల నుంచి, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. పుష్కర ఘాట్, విఐపి సరస్వతి ఘాట్‌లలో అత్యధికంగా భక్తజనం స్నానాలు ఆచరించారు. గోదావరి నది వరద నీటి మట్టం పెరగడంతో స్నానాలు ఆచరించేందుకు వీలుగా ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి వరద మట్టాన్ని క్రమబద్ధీకరించారు. బ్యారేజీ అన్ని గేట్లను ఎత్తి వేసి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టారు. వరద ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకుని ఘాట్ల వద్ద మరింత గస్తీ పెంచారు. నదీ ప్రవాహ మట్టానికి అనుగుణంగా బారికేడింగ్ మార్పుచేసి స్నాన ఘట్టాల్లో భక్తుల స్నానాలకు అనువుగా చర్యలు చేపట్టారు. శనివారం ఒడిస్సా, తమిళనాడు రాష్ట్రాల యాత్రికులు అధికంగా కనిపించారు. అదే విధంగా రాష్ట్రంలో గుంటూరు, విశాఖ జిల్లాలకు చెందినవారు అధికంగా స్నానాలు ఆచరించారు. వేకువ జామున కంటే ఎనిమిది గంటల నుంచి రద్దీ బాగా పెరిగింది. పుష్కర ఘాట్ రద్దీ యధావిధిగా కొనసాగింది. కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్, విఐపి సరస్వతి ఘాట్‌లో అత్యధికంగా పిండ ప్రదాన క్రతువులు నిర్వహించుకోవడం కన్పించింది. గోదావరి తీర ప్రాంతంలో పెరిగిన వరద ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాలైన అప్పనపల్లి, అంతర్వేది, మార్కండేయేశ్వర, కోటిలింగేశ్వరస్వామి, కోటిపల్లి, పిఠాపురం పాదగయ, ద్రాక్షారామ, సామర్లకోట, అన్నవరం, వాడపల్లి, మురమళ్ల, అయినవిల్లి క్షేత్రాల్లో శనివారం భక్తుల తాకిడి అధికమైంది. అఖండ గోదావరి నది పరిధిలో విలీన మండలాల్లోని వెంకటగిరి, కోటిలింగాల ఘాట్, పుష్కర, మార్కండేయ, శ్రద్ధానంద, టిటిడి, పద్మావతి, గౌతమి, వి ఐ పి సరస్వతి ఘాట్, ధవళేశ్వరం రామపాదాల రేవు స్నాన ఘట్టాల్లో రద్దీ కొనసాగుతోంది. అఖండ గోదావరి నది దిగువన వున్న కోటిపల్లి, అప్పనపల్లి, అంతర్వేది, రావులపాలెం, వాడపల్లి, మందపల్లి, అయినవిల్లి, కుండలేశ్వరం, మురమళ్ళ స్నాన ఘట్టాల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. తొగరపాయ ఘాట్‌లో పిండ ప్రదాన క్రతువులు అధికంగా జరిగాయి. గోదావరి జలాల గలగలల మధ్య గోదావరి తీరంలోని కుడి, ఎడమ గట్ల పరీవాహంలో ఎటు చూసినా భక్తజనం అలలుగా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అంత్య పుష్కరాలకు చేసిన కట్టుదిట్ట ట్రాఫిక్ నిబంధనలు సడలించారు. దీంతో శనివారం ఘాట్‌ల వరకు వివిధ వాహనాలను అనుమతించడంతో భక్తులు నేరుగా ఘాట్‌ల సమీపం వరకు చేరుకోగలగడంతో రద్దీ మరింతగా పెరిగింది. పుష్కర ఘాట్ వద్ద నుంచి ఇటు రిలయన్స్ వరకు, అటు కోటగుమ్మం జంక్షన్ వరకు వేసిన బారికేడ్లను తొలగించారు. అంత్య పుష్కరాలు శనివారం నాటికి ఏడవ రోజుకు చేరుకున్నాయి. చివరి మూడు రోజులూ రద్ధీ అధికంగా వుంటుందని అంచనా వేసి దానికి అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టారు.
భద్రాచలంలో పెరిగిన పుష్కర రద్దీ
భద్రాచలం: గోదావరి అంత్యపుష్కరాల 7వ రోజు శనివారం ఖమ్మం జిల్లా భద్రాచలంలో భక్తులు వెల్లువెత్తారు. వివిధ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి రావడంతో స్నానఘట్టాలు కిక్కిరిసిపోయాయి. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తర్పణాలు వదిలి, పిండప్రదానాలు నిర్వహించారు.

చిత్రం.. పుష్కర ఘాట్‌లో పుణ్య స్నానాలు