ఆంధ్రప్రదేశ్‌

ప్లాస్టిక్ సీసాల తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసన్నపేట, జూన్ 10: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కోమర్తి గ్రామం వద్ద సంభవించిన అగ్ని ప్రమాదంలో ప్లాస్టిక్ సీసాల తయారీ కేంద్రం అగ్నికి ఆహుతైంది. సోమవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్‌సర్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం పరిశ్రమ కేంద్రం దగ్ధం కాగా ఈ కేంద్రానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఒక ట్రాక్టర్ కూడా దగ్ధమైంది.
పరిశ్రమ కేంద్రం యజమాని నెయ్యిల ఉమాశంకర్, అతని సోదరలిద్దరు కలిసి మూడేళ్ల కిందట జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో కార్పొరేషన్ బ్యాంక్ ద్వారా రూ.25 లక్షల రుణం తీసుకొని దీనిని ప్రారంభించారు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకొంటూ ఇప్పుడిప్పుడే స్థిర పడుతున్న సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ప్రతీ ఏడాది కార్పొరేషన్ బ్యాంక్ ద్వారా బీమా చేయించేవారని, అయితే ఏం జరిగిందో, సాంకేతిక కారణాలో తెలియదు ఈసారి సకాలంలో బీమా చేయకపోవడంతో తాము మరింత నష్టపోవాల్సి వచ్చిందని బాధితులు వాపోయారు.
చిత్రం... మంటల్లో దగ్ధమవుతున్న ప్లాస్టిక్ సీసాల తయారీ కేంద్రం