ఆంధ్రప్రదేశ్‌

వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నామని పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ తెలిపారు. మంగళవారం నగరంలోని ఒక హోటల్‌లో వాయు కాలుష్య నివారణ చర్యలపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు ఏర్పాటు చేసిన వర్క్‌షాపును నీరబ్‌కుమార్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాయు కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రధానంగా రాష్ట్రంలోని ఐదు నగరాలపై దృష్టి పెట్టామన్నారు. విశాఖపట్నంలో వాయు కాలుష్యం 71, విజయవాడలో 104, గుంటూరులో 78, కర్నూలులో 71, నెల్లూరులో 66గా ఉందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారంగా వాయు కాలుష్యాన్ని 40 పీఎం (పార్టిక్యులేట్ మాటర్) ప్రామాణికంగా తీసుకుంటుండగా మన దేశంలో 60 పీఎంని వాయు కాలుష్యం సగటుగా తీసుకుంటున్నామన్నారు. మన రాష్ట్రంలో వాయు కాలుష్యం సగటుకన్నా ఎక్కువగా ఉందన్నారు. ముఖ్యంగా నిర్మాణ రంగం, వాహనాలు, మున్సిపల్ చెత్త, పరిశ్రమలు తదితరమైన వాటి నుంచి వాయు కాలుష్యం వస్తోందన్నారు. వీటి నుంచి వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి నిర్దిష్ట కాలపరిమితితో ప్రణాళికా బద్ధంగా పని చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ బీఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ వాయు కాలుష్యం తగ్గించడమనేది ఏదో ఒక రోజు కార్యక్రమంలా కాకుండా నిరంతర ప్రక్రియ లాగా కొనసాగాలన్నారు. అదే విధంగా నెల్లూరు, కర్నూలు ప్రాంతాల్లో రైస్ మిల్లులు నుంచి వెలువడే వాయు కాలుష్యం అధికంగా ఉందన్నారు. సెంటర్ ఫర్ నైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమితరాయ్ చౌదరి మాట్లాడుతూ ఏపీలో ఐదు నగరాలతో కలిపి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి అందుకు తగ్గట్టుగా ఆయా నగరాల్లో వాయు కాలుష్యం తగ్గించడానికి కృషి చేయాలన్నారు. ముందుగా జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ శివారెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. కార్యక్రమంలో రవాణాశాఖ, మున్సిపల్ శాఖ, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.