ఆంధ్రప్రదేశ్‌

పుష్ప శ్రీవాణిని మంత్రివర్గం నుంచి తొలగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 11: నకిలీ గిరిజన కుల ధ్రువీకరణ పత్రంతో విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన పాముల పుష్ప శ్రీవాణిని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆదివాసీ రిజర్వేషన్ పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ రామారావు దొర డిమాండ్ చేసారు. మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి ఎస్సీ కేటగిరికి చెందిన వారని, గిరిజన జాతికి చెందిన కొండదొర కులంతో నకిలీ కుల ధ్రువీకరణ పత్రాన్ని పొంది కురుపాం నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారని ఆరోపించారు. మంత్రి పుష్పశ్రీవాణి సోదరి పాముల రామతులసి గిరిజన కోటాలో ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికైనప్పటికీ ఆదివాసీల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన అధికారులు ఆమె గిరిజన వ్యక్తి కాదని నిర్థారించి ఉద్యోగానికి అనర్హులుగా ప్రకటించినట్టు చెప్పారు. తన సోదరి గిరిజన జాతికి చెందనప్పుడు మంత్రి పుష్ప శ్రీవాణి గిరిజన వ్యక్తి ఎలా అవుతారని ప్రశ్నించారు. పారదర్శక పాలన అందిస్తానని చెబుతున్న సీఎం జగన్ నకిలీ గిరిజనరాలుని గిరిజన కోటాలో మంత్రివర్గంలో స్థానం కల్పించడం పారదర్శకత అవుతుందా అని నిలదీసారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు నకిలీ గిరిజనులైన శోభా హైమావతి, శత్రుచర్ల, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌లకు మంత్రి పదవులు, గీతకు ఎంపీ పదవులను కేటాయించిన విధంగానే జగన్ కూడా నకిలీ గిరిజనులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. గిరిజన ప్రాంతానికి చెందిన ఆరుగురు గిరిజనులు ఎమ్మెల్యేలుగా ఎన్నికవ్వగా వారిని కాదని, కుల వివాదంలో ఉన్న ఆమెకు మంత్రివర్గంలో స్థానం కల్పించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఈ విషయమై ఇప్పటికైనా ముఖ్యమంత్రి పరిశీలించి పుష్ప శ్రీవాణిని మంత్రి వర్గం నుంచి తొలగించి గిరిజనుల ప్రయోజనాలను కాపాడాలని రామారావు దొర కోరారు.