ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే తమ్మినేని సీతారామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్ జారీ చేయగా, తమ్మినేని ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయింది. గురువారం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తరువాత ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు స్పీకర్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. 25 నామినేషన్లు దాఖలైనప్పటికీ, అభ్యర్థి మాత్రం తమ్మినేని ఒక్కరే కాగా, అనేక మంది ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అభ్యర్థిత్వాన్ని బలపరిచిన వారిలో కె.నారాయణ స్వామి, అంజాద్ బాషా, పుష్పశ్రీవాణి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, అనిల్ కుమార్, శంకరనారాయణ, గొల్ల బాబూరావు, ధర్మశ్రీ, రజని, ఫల్గుణ, రాజన్నదొర, జోగి రమేష్ తదితరులు ఉన్నారు. ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు ప్రకటించారు. స్పీకర్‌గా ఎన్నికైన తమ్మినేనిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభినందించి, స్పీకర్ స్థానానికి తోడ్కొని వెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, తదితరులు స్పీకర్ వెంట వెళ్లారు. తరువాత సభాపతి స్థానంలో తమ్మినేని ఆశీనులయ్యారు.