ఆంధ్రప్రదేశ్‌

రెండు రోజులకే అంత అసహనమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: ప్రతిపక్షంలో కూర్చున్న రెండో రోజుకే అంత అసహనం ఎందుకు అంటూ టీడీపీ సభ్యుల వైఖరిపై అధికార వైకాపా ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని ఎన్నికైన సందర్భంగా అసెంబ్లీలో గురువారం ఆమె మాట్లాడుతూ ఎక్కడైనా మంచి చెడుల గురించి మాట్లాడేటప్పుడు గతాన్ని గురించి కూడా మాట్లాడతామన్నారు. సభలో కొంతమంది సభ్యుల చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. స్పీకర్ కుర్చీని అవమానించడం, దాన్ని దుర్వినియోగం చేయడం టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శించారు. ఇలా ఆయన వ్యవహరించడం మొదటిసారి కాదని, గతంలో కిరణ్‌కుమార్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు కూడా ఆయన్ని అవమాన పరిచారని గుర్తు చేశారు. తాజాగా తమ్మినేనిని అవమానపరిచిన తీరును కూడా ప్రజలు చూశారన్నారు. ఇది బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తమ్మినేని స్పీకర్‌గా ఎన్నికైనందుకు అందరూ సంతోషించాలని, శ్రీకాకుళం జిల్లా వాసులు చాలా అనందపడాలన్నారు. కానీ తమ్మినేని స్పీకర్‌గా ఎన్నిక కావడంతో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు సంతోషం కంటే కడుపుమంటే ఎక్కువగా ఉన్నట్లు మాటల్లో తెలుస్తోందంటూ విమర్శించారు. గతంలో కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో తాను అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చిన వ్యవహారంలో కొంతమంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు స్పీకర్ స్థానాన్ని దుర్వినియోగం చేశారన్నారు. తనను ఏడాది పాటు సస్పెండ్ చేయడం న్యాయమా అని ప్రశ్నించారు. ఈ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వుతో వస్తే, మార్షల్స్‌తో లోపలికి రానీయకుండా బయటకు పంపేశారన్నారు. సుప్రీంతీర్పును కూడా గౌరవించని వారు సభా సంప్రదాయాల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. శాసనసభకు అంతా ఎన్నో ఆశలతో వస్తారని, వారి నియోజకవర్గాలను అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని వస్తారన్నారు. గత ప్రభుత్వం అహంకారంతో వ్యవహరించిందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో కూర్చున్న రెండో రోజుకే అసహనం ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారని, అందరినీ గౌరవిస్తున్నారన్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. అనుభవం ఉందన్నారని, హుందాతనంతో వచ్చి స్పీకర్‌ను కూర్చోబెట్టవచ్చు కదా అని చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. బీసీలకు పెద్దపీట వేస్తానన్న ఇచ్చిన మాటను జగన్ అమలు చేస్తున్నారని, స్పీకర్ స్థానం తండ్రి లాంటిదని, అందరికీ ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు.