ఆంధ్రప్రదేశ్‌

రెండు పథకాల పేర్లు మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 13: వివిధ పథకాల పేర్లు మార్పిడిలో భాగంగా తాజాగా మరో రెండు పథకాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీగా, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు పేరును డాక్టర్ వైఎస్సాఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుగా మార్చింది.
చాంబర్ల కేటాయింపుల్లో మార్పులు
గతంలో వివిధ శాఖల మంత్రులకు కేటాయించిన చాంబర్లలో రెండింటిని మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3వ బ్లాక్‌లో 203 గదిని గతంలో ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కేటాయించగా, ఆ కేటాయింపును రద్దు చేసి, దానిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేటాయించారు. 5వ బ్లాక్‌లో మంత్రి పెద్దిరెడ్డికి కేటాయించిన 188 గదిని పుష్పశ్రీవాణికి కేటాయించారు.