ఆంధ్రప్రదేశ్‌

ధవళేశ్వరం వద్ద వరద తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 8: గోదావరి నదిలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ఎగువన భద్రాచలం వద్ద వరద మట్టం తగ్గుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద కూడా నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. సోమవారం ధవళేశ్వరం బ్యారేజి వద్ద 8.7 అడుగుల నీటి మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద 35.7 అడుగులు నమోదైంది. కాటన్ బ్యారేజి 175 గేట్లను 2 మీటర్ల మేరకు ఎత్తివేసి 4 లక్షల 90 వేల 601 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ఈస్ట్రన్ డెల్టాకు 4,400 క్యూసెక్కులు, సెంట్రల్ డెల్టాకు 2,200 క్యూసెక్కులు, వెస్ట్రన్ డెల్టాకు 6,500 క్యూసెక్కుల జలాలను కాలువలకు విడుదలచేశారు. కాళేశ్వరం వద్ద 7.7 మీటర్లు, పేరూరు వద్ద 10.14, దుమ్ముగూడెం వద్ద 9.96, కూనవరం వద్ద 12.98, కుంట వద్ద 7, కొయిదా వద్ద 17.16, పోలవరం వద్ద 11.30 మీటర్ల నీటి మట్టం నమోదైంది.