ఆంధ్రప్రదేశ్‌

తప్పతాగి దొరికిపోయన రైల్వే టిసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 8: మద్యం మత్తులో ప్రయాణీకులతో అనుచితంగా, దురుసుగా ప్రవర్తించిన ఒక టిసిని రాజమహేంద్రవరం ఆర్‌పిఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళుతున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. గంగాప్రసాద్ అనే టిసి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం విధి నిర్వహణలో భాగంగా టిక్కెట్ల పరిశీలన చేపట్టారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న గంగాప్రసాద్ ప్రయాణీకుల పట్ల దురుసుగా ప్రవర్తించడంతోపాటు కొందరిని రైల్లో నుంచి తోసేస్తానని బెదిరించాడు. దీంతో ప్రయాణీకులు 182 టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా రైల్వే అధికారులకు ఫిర్యాదుచేశారు. రైల్వే అధికారుల సూచనల మేరకు జన్మభూమి రాజమహేంద్రవరం చేరుకోగానే ఆర్‌పిఎఫ్ పోలీసులు గంగాప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. చీఫ్ కమర్షియల్ ఇనస్పెక్టర్ టి శ్రీనివాసరావు ఆయన వద్దవున్న ప్రయాణీకుల చార్టును స్వాధీనం చేసుకుని, మరో టిసికి అప్పగించారు. రైల్వే వైద్యులు ఎన్‌విఎస్ కుమారి గంగాప్రసాద్‌కు వైద్యపరీక్షలు నిర్వహించి, ఆయన నుంచి పరీక్షల నిమిత్తం రక్తనమూనాను సేకరించారు.