ఆంధ్రప్రదేశ్‌

విజయసాయిరెడ్డితో సీఎం రమేష్ ముచ్చట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: పార్లమెంట్‌లో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం సమయంలో వైకాపా సీనియర్ నాయకుడు విజయ సాయిరెడ్డి, తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ లోక్‌సభ గ్యాలరీలో పక్కపక్కన కూర్చుని ముచ్చట్లు చెప్పుకున్నారు. వారిద్దరూ రాజకీయ ప్రత్యేర్థులు.. కొన్నాళ్లుగా ఒకరంటే మరొకరికి పడదు.. పరోక్షంగానే కాదు.. మీడియాలో సైతం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉండేవారు. వైకాపా నుంచి విజయ సాయిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం రమేష్ రాజ్యసభకు ప్రతినిధ్యం వహిస్తున్నారు. సభలో కూడా ఉప్పు-నిప్పులాగా వ్యవహారించేవారు. అయితే సోమవారం ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ముందుగా లోక్‌సభలో రాజ్యసభ సభ్యులకు ఏర్పాటు చేసిన గ్యాలరీకి విజయ సాయిరెడ్డి వచ్చి కూర్చునారు. అనంతరం అక్కడికి తెలుగుదేశం సభ్యుడు సీఎం రమేష్ వచ్చి ఆయన పక్కనే కూర్చున్నారు. దీంతో ఒకరికొకరు కరచాలనం చేసుకుని ముచ్చట్లు మొదలుపెట్టారు. చాలా సమయంలో వారిద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. తరువాత వీరి వద్దకు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వచ్చారు.