ఆంధ్రప్రదేశ్‌

‘బెల్ట్’ తీయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 17: రాష్టవ్య్రాప్తంగా విస్తరించిన బెల్ట్‌షాపులపై కొరడా ఝుళిపించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులు వంద శాతం తొలగించాలన్నారు. బెల్ట్‌షాపులు నిర్వహించే మద్యం దుకాణాల లైసెన్స్‌లను వెంటనే రద్దుచేయాలని సూచించారు. కఠిన చర్యలు తీసుకునే దిశగా టాస్క్ఫోర్స్ పోలీసులను రంగంలో దించాలని ఆదేశించారు. రాష్ట్రంలో బెల్ట్‌షాపుల తొలగింపుపై సోమవారం ఎక్సైజ్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అక్రమ మద్యం తయారు చేస్తున్న 190 గ్రామాలపై దృష్టి సారించాలని, బట్టీల తొలగింపునకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. బెల్ట్ షాపుల వల్ల ప్రజల ఆరోగ్య, ఆర్ధిక పరిస్థితులు క్షీణిస్తున్నాయని ముఖ్యంగా యువత పెడత్రోవ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మద్య నిషేధం దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో ఇది తొలి అడుగన్నారు. దశల వారీ మద్యనిషేధం అమల్లోకి రావాలని అందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో మద్యం విధానం, సమర్థవంతంగా అమలు చేసే ప్రక్రియలను ఆధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు నేరుగా మద్యం షాపులను నిర్వహించడం ద్వారా బెల్ట్‌షాపులను నియంత్రిస్తున్న విధానంపై పరిశీలన జరపాలన్నారు.