ఆంధ్రప్రదేశ్‌

హద్దులు మీరొద్దు: అచ్చెన్నాయుడుకు స్పీకర్ క్లాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 18: సభా నియమాలు పాటించండి.. హుందాగా వ్యవహరించండి.. హద్దులు మీరొద్దని సభలో ప్రతిపక్ష టీడీపీ ఉపనేత అచ్చెన్నాయుడిని స్పీకర్ మందలించారు. శాసనసభలో మంగళవారం ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా జగన్‌ను ఉద్దేశించి హౌస్‌ను మీరే రూల్ చేస్తున్నారని చంద్రబాబు ప్రస్తావించిన సందర్భంగా అచ్చెన్నాయుడు లేచి ముఖ్యమంత్రి గారూ నాకూ మాట్లాడే అవకాశం ఇవ్వండని వ్యంగ్యంగా అన్నారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు సభాపతిని ఎవరూ డిక్టేట్ చేయలేరని, సీఎం వైపు చూసి అవకాశం కోరటం మంచి సాంప్రదాయం కాదన్నారు. సీనియర్ సభ్యులుగా హుందాతనాన్ని పాటించాలని చురకలంటించారు.

చిత్రం...అచ్చెన్నాయుడిని మందలిస్తున్న స్పీకర్ తమ్మినేని