ఆంధ్రప్రదేశ్‌

పంటల బీమా అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: అనంతపురం జిల్లాకు ప్రధాన మంత్రి పసల్ బీమా పథకాన్ని విస్తరించాలని టిడిపి సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి లోక్‌సభలో డిమాండ్ చేశారు. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అనంతపురం కరవుబాధిత ప్రాంతం, ఇక్కడ వర్షపాతం కూడా చాలా తక్కువ అని చెబుతూ జిల్లా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధాన మంత్రి పంటల బీమా పథకాన్ని ఈ జిల్లాలో వెంటనే అమలు చేయాలన్నారు. జిల్లాలోని ఎనిమిది లక్షల హెక్టార్లలో వేరుశెనగ పండిస్తున్నారని, వర్షాభావం మూలంగా ఈ సారి పంటలు బాగా దెబ్బతిని రైతులు నష్టాలకు గురి అవుతున్నారని జెసి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేరుశనగ రైతులకు ఇన్‌పుట్ రాయితీ ప్రకటించారని, పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు.
ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కావాలి:కింజరాపు
విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని వెంటనే ప్రకటించాలని టిడిపి సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన చట్టంలోని 46వ క్లాజ్, 3వ సబ్ క్లాజ్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించవలసి ఉందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని అప్పటి ప్రధాన మంత్రి పార్లమెంటులో హామీ ఇచ్చారని ఎంపీ గుర్తుచేశారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా అత్యంత వెనుకబడిందన్న కింజరాపుజిల్లాను మరింత అభివృద్ధి చేయాలన్నారు.
వ్యాట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
ఎంపీ లాడ్స్ నిధులను వ్యాట్ పన్ను నుంచి మినహాయించాలని లోక్‌సభ సభ్యురాలు కొత్తపల్లి గీత డిమాండ్ చేశారు. లోక్‌సభ జీరో అవర్‌లో గీత ఎంపీ లాడ్స్‌పై వ్యాట్ విధించటం గురించి మాట్లాడారు. ఎంపి లాడ్స్ మార్గదర్శకాల్లో ఎక్కడ కూడా వ్యాట్ పన్ను చెల్లించాలనేది లేకున్నా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపీల నియోజకవర్గం అభివృద్ధి నిధులపై వ్యాట్ పన్ను విధిస్తున్నారని ఆమె చెప్పారు.
ఆర్‌ఎంపి, పిఎంపిలకు గుర్తింపు ఇవ్వాలి: గల్లా
ఆర్‌ఎంపిలు, పిఎంపి డాక్టర్ల కోసం దేశం మొత్తం మీద ఒకే రకమైన మార్గదర్శకాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం సభ్యుడు గళ్లా జయదేవ్ సూచించారు. జయదేవ్ సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈవిషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఆర్‌ఎంపిలు, పిఎంపిల విషయంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కవిధానాన్ని అవలంభిస్తోందని ఆయన సభ దృష్టికి తెచ్చారు.