ఆంధ్రప్రదేశ్‌

మంత్రి బొత్సకు మండలి డిప్యూటీ చైర్మన్ క్లాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 18: ఎమ్మెల్సీలు మాట్లాడిన ప్రతి అంశంపై ప్రభుత్వ వివరణ పేరుతో తరచూ మాట్లాడంపై మంత్రి బొత్స సత్యనారాయణకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం క్లాస్ తీసుకున్నారు. సభ్యుల ప్రసంగం మధ్యలో వివరణ పేరుతో మాట్లాడటం వల్ల సమయం వృథా అవుతోందని తెలిపారు. రాష్ట్ర శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ సందర్భంగా ఈ అంశం చోటు చేసుకుంది. సభ్యులు తమ ప్రసంగంలో వైకాపా, వైకాపా ప్రభుత్వం గురించి ప్రస్తావనకు రాగనే మంత్రి బొత్స మధ్యలో మాట్లాడటంపై డిప్యూటీ చైర్మన్ చురకులు వేశారు. సీనియర్ సభ్యుడైనప్పటికీ, ఇలా తనతో చెప్పించుకోవడం తగదన్నారు. సభ్యుల వివరణ అడిగిన వాటిని నోట్ చేసుకుని చివరలో ఒకేసారి సమాధానం చెప్పాలని సూచించారు. అవసరమైతే ఎక్కువ సమయం తీసుకుని వివరణ ఇవ్వాలన్నారు. తరచూ మధ్యలో మాట్లాడటం వల్ల సమయం వృథా అవుతోందన్నారు. దీనికి మంత్రి బొత్స బదులిస్తూ, సభ్యుల మాట్లాడిన దానిపై ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వడం సంప్రదాయమన్నారు. అంతకుముందు చైర్మన్ షరీఫ్ కూడా బొత్స, తదితరుల తీరును సరికాదని హెచ్చరించారు. సభ్యులు నేరుగా మాట్లాడుకున్నా, చైర్ అనుమతి లేకుండా మాట్లాడినా చేయాలన్నారు.