ఆంధ్రప్రదేశ్‌

నాడు మా గొంతు నొక్కినా నేడు మీకు అవకాశం ఇస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూన్ 18: నాడు 68 మంది సభ్యులున్నా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్‌లు కట్‌చేశారు.. మా గొంతు నొక్కారు.. అయినా మేం మీలా కాదు.. మీకు అవకాశం ఇస్తున్నాం.. మాట్లాడండని ప్రతిపక్షనేత చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్ చురకలు వేశారు. మంగళవారం శాసనసభలో ప్రత్యేక హోదా తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హోదాపై మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుపట్టారు. అదే సమయంలో హోదాపై మాట్లాడేందుకు ఉపక్రమించిన సీఎం జగన్ స్పందిస్తూ మీలో ఇంకా మార్పురాలేదు.. ఇంకా ఇలానే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికలకు 13 సీట్లు మిగులుతాయి.. జాగ్రత్త అంటూ హెచ్చరించారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ‘హౌస్‌ను మీరే రూల్ చేస్తున్నట్లు అర్థమవుతోంద’ని వ్యాఖ్యానించారు. నేను ఈ హౌస్‌లో చాలామందిని చూశా.. వేలెత్తి చూపి మాట్లాడుతున్నారు.. ఇది మంచి సాంప్రదాయం కాదు.. నన్ను వేలెత్తి చూపే ముందు అనేకమంది మిమ్మల్ని వేలెత్తి చూపుతారని ప్రతిస్పందించారు.