ఆంధ్రప్రదేశ్‌

శాసన మండలిపై వైకాపా దృష్టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 19: రాష్ట్ర అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉండటంతో అధికార వైకాపా దూకుడుకు ఇబ్బంది లేకపోయినా, శాసన మండలిలో కొంత ఇబ్బందికర పరిస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటోంది. రాష్ట్ర శాసన మండలిలో టీడీపీకి బలం ఎక్కువగా ఉండటంతో, అక్కడ పట్టు సాధించే అంశంపై వైకాపా దృష్టి సారించింది. అసెంబ్లీలో వైకాపాదే పైచేయి కావడంతో అక్కడ ప్రతిపక్షమైన టీడీపీపై తీవ్ర విమర్శలతో మాటల దాడి చేస్తోంది. విమర్శల జోరును తిప్పికొట్టడానికి టీడీపీ కష్టపడాల్సి వస్తోంది.
శాసన మండలిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. మండలిలో టీడీపీకి 37 మంది సభ్యులు ఉండటం, వైకాపాకు కేవలం ఆరుగురు సభ్యులే ఉండటంతో టీడీపీ సభ్యుల దాడిని తిప్పికొట్టడంలో వెనుకబడింది. అయినప్పటికీ మండలిలో టీడీపీ జోరును అడ్డుకునేందుకు మంత్రులను రంగంలోకి దించింది. ఇటీవల ముగిసిన శాసన మండలి సమావేశాల్లో రెండు రోజులు కూడా మంత్రి బొత్స సత్యనారాయణ మండలిలోనే ఉండటం గమనార్హం. మంత్రులు అవంతి శ్రీనివాసరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, కన్నబాబు కూడా సభలో ఉండి టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ వివరణ పేరుతో తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.
మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ కూడా టీడీపీకి చెందిన వారే కావడంతో కూడా వైకాపాకు కొంత ఇబ్బందిగా పరిణమించించిదనవచ్చు. వైకాపా సభ్యులు, మంత్రులు మాట్లాడేందుకు తగినంత సమయం లభించడం లేదని ఆ పార్టీ వర్గాల ఆరోపణ. దీనిని దృష్టిలో ఉంచుకుని మండలిపై పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా వైకాపా పావులు కదుపుతోంది. ఇప్పటికే అధికార పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్ధమని, నిర్మాణాత్మకంగా సహకరిస్తామని ఐదుగురు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ప్రకటించడం గమనార్హం. ఈ విధంగా పీడీఎఫ్ సభ్యుల మద్దతు కూడ గట్టుకుంది. మండలిలో వైకాపా సంఖ్యాబలం ఇప్పట్లో పెరిగే అవకాశం లేకపోవడంతో మంత్రులను రంగంలోకి దించనుంది. టీడీపీ సభ్యుల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు వీలుగా అధిక సంఖ్యలో మంత్రలు మండలిలోనే ఎక్కువ సమయం ఉండే అంశాన్ని ఆ పార్టీ వర్గాలు పరిశీలిస్తున్నాయి. టీడీపీ సభ్యులు చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు వీలుగా సమర్థులైన మంత్రులను మండలిలో ఉండేలా చేయడం ద్వారా టీడీపీ జోరుకు అడ్డుకట్ట వేయనున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రతిపాదనను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇలాఉంటే అసెంబ్లీలో ఎదుర్కొంటున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మండలిలో వైకాపాను ఇరుకున పెట్టేందుకు అనుసరించాల్సి వ్యూహంపై టీడీపీపై దృష్టి సారించింది. న్యాయపరమైన, సాంకేతిక అంశాలపై యనమల రామకృష్డుడుకు బాధ్యత అప్పగించి, సభ నిర్వహణపై దృష్టి సారించనుంది. చైర్మన్‌గా షరీఫ్ సభ నిర్వహణలో కొంత మొతక వైఖరి అనుసరిస్తుండటంతో కీలక సమయాల్లో డిప్యూటీ చైర్మన్ సేవలను ఉపయోగించుకోవడం ద్వారా సభలో వైకాపా స్పీడ్‌కు బ్రేక్ వేయవచ్చని భావిస్తున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు యూరప్ పర్యటన తరువాత, దీనిపై మరింత స్పష్టత రావచ్చని తెలుస్తోంది.