ఆంధ్రప్రదేశ్‌

యూరప్‌లో మంచు పర్వతారోహణకు ఇద్దరు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 20: యూరప్‌లోని అత్యంత ఎత్తయిన ఎల్‌బ్రూస్ మంచు పర్వతారోహణకు రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికయ్యారు. వారిలో విజయనగరానికి చెందిన పోలీసు శిక్షణ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కాకుమాను రాజశిఖామణి, మరొకరు నెల్లూరుకు చెందిన జె.సూర్య ఉన్నారు. వీరిద్దరు ఈనెల 29 నుంచి వచ్చేనెల 8వతేదీ వరకు పర్వతారోహణ చేస్తారు. రష్యాలోని కాకస్ పర్వతాలలో ఉన్న ఎల్‌బ్రూస్ పర్వతం ఎత్తు 5642 మీటర్లు(18510 అడుగులు). ఈ మంచు పర్వతం దాదాపు మైనస్ 25 డిగ్రీలు ఉష్ణోగ్రతలో ఉంటుంది. ఈ పర్వతారోహణకు సాహసం చేస్తున్న తొలి రిటైర్డ్ పోలీసు అధికారిగా రాజశిఖామణి నిలిచిపోతారు. గతంలో ఆయన విజయనగరం నుంచి విశాఖ, విజయనగరం నుంచి బొబ్బిలి వరకు వాక్ అండ్ రన్ కార్యక్రమాలు చేపట్టారు. ఈ యాత్రను హైదరాబాద్‌కు చెందిన ట్రానె్సండ్ అడ్వంచర్స్ సంస్ధ నిర్వహిస్తోందని రాజశిఖామణి గురువారం తెలిపారు.