ఆంధ్రప్రదేశ్‌

గోదావరి తీరాన భక్తజన ‘వరద’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 8: గోదావరి తీరంలో అంత్య పుష్కర స్నానాలకు భక్త జనం వరదలా పొంగింది. సోమవారం తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని వివిధ స్నాన ఘట్టాల్లో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు. సుమారు 1.32 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక వైపు గోదావరి నదికి వరద పోటెత్తగా, మరో వైపు పుణ్య స్నానాలకు భక్త జనం జిల్లా వ్యాప్తంగా తరలివచ్చారు. గోదావరి ఎగువ ప్రాంతంలో వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో రాజమహేంద్రవరం వద్ద స్నాన ఘట్టాలను వరద నీరు ముంచెత్తింది. కోటిలింగాల ఘాట్‌లో భారీగా వరద జలాలు మెట్లపైకి రావడంతో యాత్రికులు దుస్తులు మార్చుకోవడానికి తాత్కాలికంగా ఏర్పాటుచేసిన షెడ్లు మునిగిపోయాయి. దీంతో స్నానాలు ఆచరించే భక్తులను అధికార యంత్రాంగం అప్రమత్తంచేసింది. స్నాన ఘట్టాల్లో బారికేడ్లను స్నానాలకు అనువుగా మార్పుచేశారు. రేవుల్లో రక్షణ వలయంగా ఉండే నావలను మరింత కట్టుదిట్టం చేసి వాలంటీర్ల పహారా పెంచారు. నదిలోకి లోతుగా వెళ్ళకుండా కట్టుదిట్టం చేశారు. అనధికార ఘాట్లలో స్నానాలు ఆచరించకుండా పోలీసు పహారా పెట్టారు. రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్, సరస్వతి వి ఐపి ఘాట్, గౌతమీ ఘాట్, మార్కండేయ ఘాట్‌ల్లో రద్దీ పెరిగింది. వేకువ జాము నుంచి భక్తుల రద్దీ అత్యధికంగా కన్పించింది. దూర ప్రాంతాల నుంచి పుష్కర యాత్రికులు అత్యధికంగా వచ్చారు. రాష్ట్రేతర ప్రాంతం నుంచి కూడా భక్తులు అత్యధికంగా వచ్చారు. పశ్చిమ బంగ, కర్ణాటక రాష్ట్రాలతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, అనంతపురం, కర్నూలు, చిత్తూరు తదితర జిల్లాల నుంచి అత్యధికంగా భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ఒక్కో రైలు నుంచి సుమారు నాలుగు వేల వరకు యాత్రికులు పుణ్య స్నానాలకు దిగుతుండటం విశేషం. వేకువ జాము నుంచి మధ్యాహ్నం వరకు ఘాట్లలో రద్దీ విపరీతంగావుంది. పితృ కర్మలు కూడా అత్యధికంగా ఆచరించడం కన్పించింది. కోటిపల్లి, వాడపల్లి, అప్పనపల్లి, రాజోలు, జొన్నాడ, రావులపాలెం, మందపల్లి, మురమళ్ళ, తొగరపాయ రేవు, కుండలేశ్వరం స్నాన ఘట్టాలు కిటకిటలాడాయి.

చిత్రం.. భక్తులతో కిటకిటలాడుతున్న రాజమహేంద్రవరం పుష్కరఘాట్