ఆంధ్రప్రదేశ్‌

టీటీడీ పాలకమండలిలో ఆధ్యాత్మిక చింతన ఉన్నవారినే నియమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 21: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)్ధర్మకర్తల మండలిలో రాజకీయ నాయకులనే కాకుండా ఆధ్యాత్మిక చింతన ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆధ్యాత్మిక వేత్త కొండవీటి జ్యోతిర్మయి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆమె విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మండలిలో ముగ్గురు రాజకీయ నాయకులు ఉండవచ్చన్న టీటీడీ బైలా పక్కన పెట్టి రాజకీయ నాయకులతోనే పాలకమండలిని ఏర్పాటు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను పాదయాత్ర సమయంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని, అప్పుడాయన దీనిపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తాను అనుకుంటున్న అవినీతి నిర్మూలనను టీటీడీ పాలకమండలి నుంచే ప్రారంభించాలని సూచించారు. పాలకమండలిలో నిబంధనల ప్రకారం ముగ్గురు రాజకీయ నాయకులకు స్థానం కల్పించాలని, మిగిలిన వారంతా రైతు, ఉత్తమ ఉపాధ్యాయుడు, సైనికుడు ఇలా ఆధ్యాత్మిక చింతన ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, దేవాలయాలు వాటి చరిత్ర, ప్రాధాన్యత తెలిసిన శ్రీవారి భక్తులను ఎంపిక చేసి నియమించాలని ఆమె కోరారు. గత ప్రభుత్వాల దృష్టికి తానీ విషయాన్ని తీసుకెళ్లినా నాటి పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు.