ఆంధ్రప్రదేశ్‌

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 21: ప్రజాస్వామ్యం పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పార్టీ మారిన టీడీపీ ఎంపీలపై అనర్హత వేటు వేసి, పదవుల నుండి తొలగించాలని రాజ్యసభ చైర్మన్, ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ కోరారు. ప్రజాస్వామిక విలువలను కాపాడేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధానికి కఠిన చట్టాన్ని తీసుకురావాలని, లేనిపక్షంలో మీరు కూడా చరిత్ర హీనుడిలా మిగిలిపోవడం తథ్యమని శుక్రవారం వెంకయ్యనాయుడికి రాసిన లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు. టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన నలుగురు సభ్యులు నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయించి ప్రజాస్వామిక విలువలను దిగజార్చారని కనీసం టీడీపీపీ సమావేశం కూడా జరపకుండా బీజేపీలో విలీనమవుతున్నట్లు లేఖ ఇచ్చారన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేసి మారాలని, లేకుంటే పార్టీ ఫిరాయించిన తక్షణమే పదవి పోయేలా చట్టం తీసుకురావాలంటూ ఇటీవల ఉపరాష్టప్రతిగా మీరు చేసిన వ్యాఖ్యలను ప్రజాస్వామిక వాదులంతా స్వాగతించారని, కాని ఇప్పుడు మీరే స్వయంగా రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉండి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రామకృష్ణ అన్నారు. తెలంగాణాలో కేసీఆర్ ప్రోద్బలంతో అప్పటి స్పీకర్ మధుసూదనాచారి, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ప్రోద్బలంతో అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావులు పార్టీ ఫిర్యాయింపులను ప్రోత్సహించి స్పీకర్ పదవికి కళంకం తెచ్చారని అదే బాటలో మీరు కూడా చేయడం విచారకరమని పేర్కొన్నారు.