ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీలో వాలంటరీ రిటైర్మెంట్ ఉద్యోగులకు పెన్షన్ విధానంలో వెసులుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: ఏపీఎస్ ఆర్టీసీలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగ, కార్మికుల పెన్షన్ విధానంలో గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్ విజ్ఞప్తి మేర కొంత వెసులుబాటు కల్పిస్తూ సంస్థ ఎండీ ఎన్‌వీ సురేంద్రబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి గత ఫిబ్రవరిలో బోర్డు తీర్మానం మేర కొన్ని మార్పులతో 83 నంబర్‌తో కొత్త సర్క్యులర్ జారీ అయింది. దీని ప్రకారం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వారికి ఎస్‌ఆర్‌బీఎస్ పెన్షన్ సౌకర్యం, అలాగే అమ ల్లో ఉన్న వైద్య సేవల ప్రకారం రిటైర్మంట్ తదుపరి కూడా సేవలందించే ప్రయోజనాలను సమకూర్చారు. అప్పటివరకు అమల్లోనున్న అడిషనల్ మానిటరీ బెనిఫిట్, అలాగే పీఎఫ్ ఖాతాకు నోషనల్‌గా అందించే ఎంప్లాయర్ వాటా, నోషనల్ గ్రా ట్యూటీ సదుపాయాలు రద్దు చేశారు. ఈ మార్పు పెద్ద ప్రయోజనకరంగా లేదని గుర్తింపు సంఘం చెప్పడంతో పాత విధానం, లేదా కొత్త విధానం రెండింటితో దేన్నైనా ఎంపిక చేసుకునే సౌకర్యం కల్పించారు. తాజా సర్క్యులర్‌పై జేఏసీ కన్వీన ర్, ఈయు ప్రధాన కార్యదర్శి దామోదరరావు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.