ఆంధ్రప్రదేశ్‌

కాంట్రాక్టర్ల పద్ధతి మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: పని చేయకపోవడాన్ని అలవాటుగా మార్చుకున్న కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు తమ పనితీరు మార్చుకోపోతే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. ఇంజనీర్లకు కూడా ఇందులో మినహాయింపు లేదని చెప్పారు. గృహ నిర్మాణ శాఖపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. బిల్లుల చెల్లింపులో ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ నిర్మాణ శాఖను అన్నివిధాలా బలోపేతం చేస్తామని చెప్పారు. అసంపూర్తిగా మిగిలిన, వివిధ దశల్లో నిర్మాణంలో వున్న ఇళ్ళకు సంబంధించి ఇంజనీరింగ్ విద్యార్థులతో పరిశీలన చేయిస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశీలించే ప్రతి ఇంటికి ఫొటో తీసి అప్‌లోడ్ చేసి, జియోట్యాగింగ్ చేయిస్తామన్నారు. విద్యార్థుల పరిశీలన పూర్తయిన తరువాతే ఎఇ వెళ్లి సర్టిఫై చేయాలని చంద్రబాబు చెప్పారు. తరువాతే లబ్దిదారులకు చెల్లింపులు జరుపుతామని స్పష్టం చేశారు. ఇదిలావుండగా, గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల ఇళ్లను నిర్మించనున్నట్టు చెప్పారు.
పుష్కరాల స్ఫూర్తితో రాష్ట్భ్రావృద్ధి
పుష్కర స్నానం అంటే కేవలం నదీస్నానం మాత్రమే కాదని, దాన్ని పవిత్ర స్నానంగా భావించి పవిత్ర సంకల్పం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. పుష్కర ఘాట్ల ఇంచార్జిలు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, రాష్టమ్రంత్రులతో గురువారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నీరు-ప్రగతికి పుష్కరాలను వేదికగా చేసుకోవాలని సూచించారు. ఈ పుష్కరాల తరువాత రాష్ట్రంలో మరిన్ని నదులను అనుసంధానం చేస్తామని చెప్పారు.