ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో ‘నైపర్’ ఏర్పాటు చేయాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 4: అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) ఏర్పాటు ప్రతిపాదనకు మళ్లీ కదలిక వచ్చింది. దాదాపు నాలుగేళ్ల కిందట అప్పటి కేంద్ర మంత్రి దివంగత అనంతకుమార్ విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఇచ్చిన హామీ మేరకు నైపర్‌ను విశాఖలో ఏర్పాటు చేయాలని వైజాగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ అభ్యర్ధనకు ప్రస్తుత రసాయనాలు, ఎరువుల శాఖా మంత్రి డీవీ సదానంద గౌడ సానుకూలంగా స్పందించారు. ఫార్మా స్యూటికల్ సైన్స్‌లో అత్యుత్తమ పరిశోధనలతో మానవాళికి ఉపయోగకరమైన రోగనిరోధక మందుల తయారీ ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో తొలి సారిగా ఫార్మాస్యూటికల్ సైన్స్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. జాతి ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నైపర్‌ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సొంతంగా పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన పాలక మండలితో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మా స్యూటికల్, కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఇది పనిచేయాల్సి ఉంది. ఫార్మాస్యూటికల్ రంగంలో ప్రయోగాలు, నూతన రోగనిరోధకాల సృష్టిలో నిష్ణాతులను తయారు చేయాలన్నదే నైపర్ లక్ష్యం. ఇది భారత యూనివర్శిటీలతో పాటు కామనె్వల్త్ యూనివర్శిటీల్లో సభ్యత్వంతో వాటిని సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుంది. ఎన్‌డీఏ తొలి సారి అధికారంలోకి వచ్చినప్పుడే నైపర్ ఏర్పాటుపై విస్తృత మథనం కొనసాగింది. గతంలో ఎన్‌డీఏతో భాగస్వామ్యం కలిగిన రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం నైపర్ ఏర్పాటుకు తాము పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. దీనిలో భాగంగానే అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో దీనిపై చర్చ కూడా జరిగింది. అప్పటి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి దివంగత అనంతకుమార్ విశాఖలో భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఏపీలో నైపర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసి, ప్రకటన కూడా చేశారు. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఏర్పాటుకు విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో స్థలాన్ని కూడా పరిశీలించారు. అయితే అప్పట్లో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నైపర్ ఏర్పాటు అంశం మరుగున పడిపోయింది.
తాజాగా వైజాగ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ప్రతినిధి నరేష్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధ్రీశ్వరి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడను ఢిల్లీలో గురువారం కలిసి నైపర్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. దివంగత మంత్రి విశాఖలో ఇచ్చిన హామీ మేరకు నైపర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి సదానంద గౌడ రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించి, సహకారం అందించిన పక్షంలో తాము దీనిపై సానుకూలత చూపుతామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ వస్తే మిగిలిన కార్యక్రమాలు చేపడతామని వారికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రాన్ని సంప్రదిస్తే ప్రతిష్టాత్మకమైన మరో అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థ విశాఖకు వచ్చే అవకాశం ఉందని నరేష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.యండి

చిత్రం...కేంద్ర మంత్రి సదానంద గౌడకు వినతిపత్రం అందజేస్తున్న కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి, వీడీసీ
ప్రతినిధి నరేష్ కుమార్