ఆంధ్రప్రదేశ్‌

నిర్మాణం అక్రమమా.. సక్రమమా.. చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 8: కృష్ణానది కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు అక్రమమా, సక్రమమా? అని తాను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా బీసీ మహిళ పంచుమర్తి అనూరాధతో తనపై ఆరోపణలు చేయించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. సోమవారం మంగళగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత మూడేళ్లుగా చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిపై పోరాడుతున్నానని, కోర్టు ద్వారా నోటీసులు వచ్చినా ఆయన స్పందించలేదని చెప్పారు. తనకు కాకపోయినా ప్రజలకైనా సమాధానం చెప్పాలని, బీసీ మహిళపై చంద్రబాబు, లోకేష్ ఒత్తిడి తెచ్చి తనపై ఆరోపణలు చేయిస్తున్నారని ఆర్కే విమర్శించారు. పంచుమర్తి అనూరాధ కూడా వాస్తవాలు తెలుసుకోవాలని, కరకట్టపై తాను దందా చేస్తున్నట్లు ఆరోపించడం చూస్తుంటే నియోజకవర్గంలో ఆమె పర్యటించలేదని స్పష్టమవుతోందన్నారు. తాను తప్పులు చేస్తానని గానీ, లంచాలు తీసుకుంటానని గానీ నిరూపిస్తే రాజకీయాల నుంచే తప్పుకుంటానని సవాల్ విసిరారు. నియోజకవర్గ టీడీపీ నాయకులు సైతం తనపై ఇలాంటి ఆరోపణలు ఎన్నడూ చేయలేదన్నారు. ఎవరైనా ఆరోపణలు చేసేముందు ఆధారాలు ఉండాలన్నారు. కృష్ణానది కరకట్ట మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నందునే స్థానిక శాసనసభ్యుడిగా తాను అక్రమ కట్టడాలపై పోరాడుతున్నానని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు.