ఆంధ్రప్రదేశ్‌

బీజేపీని ఓడించినందుకే ఏపీపై కేంద్రం కక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 8: రాష్ట్రంలో బీజేపీని ఘోరంగా ఓడించిన ప్రజలపై కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ కక్ష తీర్చుకుంటున్నారని, అందుకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్టే నిదర్శనమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీ శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. సీపీఎం ఆధ్వర్యంలో ‘కేంద్ర బడ్జెట్ 2019-ఏపీకి అన్యాయం’ అనే అంశంపై విశాఖలో సోమవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థులకు డిపాజిట్‌లు కూడా ఇవ్వకుండా ఓడించారన్న అక్కసుతో మోదీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారన్నారు.
విభజన హామీలతో పాటు ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించకపోవడం తెలుగు ప్రజలను ఎంతగానో కలచివేసిందన్నారు. కడప ఉక్కు పరిశ్రమ, దుగరాజపట్నం లేదా రామాయపట్నం పోర్టుల నిర్మాణం ప్రస్తావన ఎక్కడా లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల మేరకు రూ.52వేల కోట్ల అంచనాలపై బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా విదల్చలేదన్నారు. విశాఖ రైల్వే జోన్, కొత్త రైళ్ల మంజూరు, కొత్త లైన్ల ఏర్పాటు వంటి అంశాల ఊసే లేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న 11 కేంద్ర విద్యా సంస్థల్ని ఏర్పాటు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం వాటి నిర్మాణానికి అవసరమైన నిధుల విషయంలో మాత్రం తీరని అన్యాయం చేస్తోందన్నారు. గిరిజన యూనివర్శిటీకి కేవలం రూ.4 కోట్లు, ఐఐపీఈకి రూ.31 కోట్ల బడ్జెట్ కేటాయింపులు కంటితుడుపు చర్యగా పేర్కొన్నారు. ఇక రాజధాని అమరావతి ప్రస్తావనే లేదన్నారు. తెలుగు ప్రజలు మోదీ కాళ్ల ముందు మోకరిల్లాలన్న అహంభావంతో ప్రవర్తిస్తున్నారని, ఇది తెలుగు వారి ఆత్మగౌరవానికే తీరని అవమానంగా పేర్కొన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధించి తెస్తానని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి జగన్ గెలుపొందిన 22 మంది ఎంపీలతో సాధించలేరా అని ప్రశ్నించారు. కేంద్రంలో మోదీ సర్కారుకు పూర్తి మెజార్టీ వచ్చిందని, ఇప్పుడు వారిని మనం డిమాండ్ చేసే పరిస్థితి లేకపోగా, వారు దయతలచి ఇస్తే తీసుకోవడమే అంటూ హోదా అంశాన్ని మరుగున పెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో జగన్ మాటమార్చడం వెనుక మర్మం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంతో పోరాడేందుకు ముందుకు వస్తే యావత్ రాష్ట్రం మీ వెనకే ఉంటుందని భరోసానిచ్చారు.
జాతీయ పరంగా చూస్తే కేంద్రం ప్రవేశపెట్టిన 2019 బెడ్జెట్ కేవలం రాజకీయ ప్రక్రియగా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. జీడీపీ 7 శాతంగా కేంద్రం పేర్కొంటోందని, వాస్తవానికి ఇది 5.4 శాతం మాత్రమేనన్నారు. ఉత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టకుండా ఉపాధి కల్పన ఎలా సాధ్యమని ప్రశ్నించారు. నిరర్ధక ఆస్తులు పేరుకుపోయి తీవ్ర సంక్షోభంలో ఉన్న బ్యాంకులకు ఈ బడ్జెట్‌లో రూ.70వేల కోట్లు కేటాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. కార్పొరేట్ సంస్థల తీసుకున్న రుణాలు ఎగవేయడం ద్వారా బ్యాంకులు నష్టాల్లో కూరుకుపోయాయని, వీటిని కాపాడేందుకు ప్రజలు సొమ్ముతో భర్తీ చేయడం ఏమిటని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థల నుంచి మొండి బకాయిలు రాబట్టకుండా వారికి వెసులుబాటు కల్పించి ప్రజా సొమ్మును దోచిపెడుతున్నారని ఆరోపించారు. సాగరమథనంలో వచ్చిన అమృతాన్ని దేవతలకు, హాలాహలాన్ని రాక్షసులకు పంచగా, మోదీ సర్కారు ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతూ, పన్నుల భారాన్ని ప్రజలపై మోపుతోందని ఆరోపించారు.
చిత్రం...కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయంపై ప్రసంగిస్తున్న సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీనివాసరావు