ఆంధ్రప్రదేశ్‌

శ్రవణంలో అడ్మిషన్లకు పరిమితి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 24: టిటిడి సామాజిక సేవా కార్యక్రమాల్లో శ్రవణం అతి ముఖ్యమైందని, వినికిడి లోపంతో ఉన్న మూడు సంవత్సరాల్లోపు పిల్లలు ఎంతమందికైనా ఈ ప్రాజెక్టులో అడ్మిషన్లు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని టిటిడి ఇఒ డి సాంబశివరావు అన్నారు. స్థానిక శ్రీ వేంకటేశ్వర వినికిడిలోపం ఉన్న చిన్నారుల శిక్షణ సంస్థ పదో వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇఒ మాట్లాడుతూ శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న కానుకలతో ధర్మప్రచారంతోపాటు పేదల కోసం విద్య, వైద్యం, సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో పేద రోగులకు ఉచితంగా చికిత్సతోపాటు పలు సంక్షేమ చర్యలు చేపట్టామని, బర్డ్ ఆసుపత్రి సామర్థ్యాన్ని రానున్న మూడు నెలల కాలంలో రెట్టింపు చేయనున్నామని వివరించారు. వినికిడి లోపం ఉన్న చిన్నారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా సాధారణ పిల్లలతో కలిసిపోయి చదువుకునేందుకు వీలుగా 2006లో శ్రవణం ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. ఈప్రాజెక్టుకింద తిరుపతి, విశాఖ 205మంది విద్యార్థులు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 31మంది చిన్నారులు కోర్సు పూర్తి చేసుకుని సాధారణ పాఠశాలల్లో చేరుతున్నట్లు ఇఒ తెలిపారు.

హార్స్‌లీహిల్స్‌లో
క్రీడల శిక్షణా కేంద్రం
వచ్చే ఏడాది నుంచి పాఠ్యాంశంగా వ్యాయామ విద్య
క్రీడల అదనపు కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం
చిత్తూరు, మార్చి 24 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల అదనపు కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. జాతీయ క్రీడలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిన నేపథ్యంలో క్రీడలశాఖ అదనపు కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం గురువారం చిత్తూరు నగరంలోని మెసానికల్ క్రీడాపాంగణాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడా ప్రాంగణంలోని మైదానం, స్కేటింగ్, షటిల్ బాల్ బాడ్మింటన్ కోర్టులు, జిమ్‌లను సందర్శించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 1వ తరగతి నుంచి క్రీడల పట్ల, విద్యార్థుల దేహదారుఢ్యం పెంపును దృష్టిలో ఉంచుకుని రానున్న జూన్ నెల నుంచి రాష్ట్రంలోని 64 వేల ప్రభుత్వ పాఠశాలల్లో వ్యాయామ విద్య బోధన తప్పనిసరి చేస్తామన్నారు. వచ్చే జూన్ నాటికి అన్ని రకాల క్రీడలకు సంబంధించి క్రీడాకారులను ఎంపిక చేయాలని నిర్ణయించామన్నారు. ఈ ఎంపిక కార్యక్రమం పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల క్రీడాధికారులను ఆదేశించామన్నారు. వ్యక్తిగత క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ క్రీడలను 85 శాతం వరకు, గ్రూపు క్రీడలకు 10-15 శాతం ప్రాధాన్యత ఉండేలా చూస్తామన్నారు. రానున్న రెండేళ్లలో ఉత్తమ క్రీడాకారులను తయారు చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని హార్శిలీహిల్స్‌లో అన్ని హంగులతో క్రీడాకారుల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.