ఆంధ్రప్రదేశ్‌

నిజాలు తెలుసుకునే బీజేపీలోకి వలసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 12: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను తెలుసుకుని వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ బీజేపీకి మద్దతు పలుకుతారన్నారు. శుక్రవారం గుంటూరులోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన పలు పార్టీల నేతలు బీజేపీలో చేరారు. వారికి కన్నా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈనెల 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 2019 సంఘటన పర్వ్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి బీజేపీ అధిష్ఠానం శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారన్నారు. గతంలో చంద్రబాబు అవినీతిపాలన నిజానిజాలను తెలుసుకుని బీజేపీలోకి వస్తున్నారన్నారు. నిత్యం రాష్టవ్య్రాప్తంగా ఏదో ఒక మూల నుంచి తెలుగుదేశం పార్టీ, జనసేన, లోక్‌సత్తా, సమాజ్ వాది పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ఈ చేరికలు ఎంతగానో దోహద పడతాయని కన్నా పేర్కొన్నారు. కాగా నెల్లూరు నుండి జనసేన తరపున పోటీచేసిన తేలపల్లి రాఘవయ్య, ఆ జిల్లాకు చెందిన జనసేన నేతలు నరసింహారెడ్డి, హనుమంతరెడ్డి, వెంకట నారాయణ, శివరామ్ యాదవ్, యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి సింగా ప్రసాద్, సురవరం వీరారెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, రాష్ట్ర కార్యదర్శులు అడపా నాగేంద్రం, తాళ్ల వెంకటేష్ యాదవ్, టివి రావు తదితరులు పాల్గొన్నారు.