ఆంధ్రప్రదేశ్‌

తిత్లీ బాధిత రైతు కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందస, జూలై 13: శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాహడాపల్లి గ్రామానికి చెందిన రైతు కె.దానయ్య అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం కలెక్టర్ నివాస్, పలాస ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు బాధిత రైతు కుటుంబీకులను పరామర్శించి, ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకొని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధిత మృతుడి కుటుంబానికి 7 లక్షల రూపాయల పరిహారం, ఇంటి స్థలం మంజూరు, కుటుంబీకుల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామన్నారు. రైతులెవరూ ఆత్మహత్యకు పాల్పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, అన్నదాతలు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కుటుంబానికి అన్యాయం చేయవద్దని హితవు పలికారు. ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతాన్ని సీఎం జగన్ అన్ని విధాలుగా ఆదుకుంటారని, కిడ్నీ బాధితులకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, తిత్లీ బాధితులకు పరిహారం అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ నేతలు మెట్టకుమారస్వామి, దానయ్య, ఎ.శేషగిరి, బల్ల గిరిబాబు, ఎం.కృష్ణారావు, భూపతి పాల్గొన్నారు.
చిత్రం... బలవన్మరణానికి పాల్పడిన రైతు కుటుంబాన్ని పరామర్శిస్తున్న
కలెక్టర్ నివాస్, ఎమ్మెల్యే సీదిరి