ఆంధ్రప్రదేశ్‌

బర్డ్ ఆసుపత్రికి ప్రపంచ స్థాయి ప్రమాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 13: బర్డ్ ఆస్పత్రిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి బర్డ్ ఆస్పత్రి ఐసీయూ, వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ బర్డ్‌కు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతోపాటుగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి ఎక్కువగా రోగులు వస్తున్నారని వివరించారు. రోగులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. సుమారు రూ. 4 కోట్లతో 40 అదనపు గదులు నిర్మిస్తామని, ఆపరేషన్ థియేటర్‌లో అధునాతన వైద్య పరికరాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి అవసరమైన నిధులు విడుదల చేస్తామన్నారు. ఇటీవల శ్రీవారి సేవాసదన్ పై అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి, స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీవారి సేవకుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటామని ఆయన తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సామాన్య భక్తులకు సంతృప్తికరంగా స్వామివారి దర్శనం కల్పించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని తెలిపారు. ఈ తనిఖీల్లో బర్డ్ ఇన్చార్జ్ డైరెక్టర్ డాక్టర్ వెంకారెడ్డి కూడా పాల్గొన్నారు.