ఆంధ్రప్రదేశ్‌

సీపీఎస్ రద్దు సంగతి ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బ్యూరో): కంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్) రద్దు సంగతి ఏమైందని ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్ర శాసన మండలిలో బడ్జెట్‌పై మంగళవారం చర్చ జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ తన పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన 7 రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 45 రోజులైందని, రద్దు చేయకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. కమిటీని మాత్రం వేశారన్నారు. రాష్ట్రంలో సీపీఎస్ అమలు జరుగుతున్న వారు 1.8 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వైకాపాకు దాదాపు 25 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇందులో 10 లక్షల ఓట్లు సీపీఎస్ వాళ్లవేనని తెలిపారు. అయినా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో జారీ చేసిన కొన్ని జీవోలను రద్దు చేస్తే, పాత పింఛను విధానం అమలు చేయవచ్చని అంటున్నారన్నారు. కానీ బడ్జెట్‌లో పాత పింఛను విధానం అమలు చేస్తామని చెప్పలేదన్నారు. ప్రభుత్వం ఏం చేస్తోందో తెలియడం లేదన్నారు. సాక్షర భారత్ కింద కేంద్రం నిధుల విడుదల ఆపేయడంతో 21 వేల మందిని తొలగించారని తెలిపారు. రాష్ట్రంలో 33 శాతం నిరక్ష్యరాస్యత ఉన్న నేపథ్యంలో దానిని ఎలా అధిగమిస్తారో బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎందుకు కొనసాగించరని ప్రశ్నించారు.
సైకిళ్ల కొనుగోళ్ల జోలికి వెళ్లడం లేదు : మంత్రి సురేష్
రాష్ట్రంలో బాలికలకు పంపిణీ చేసిన సైకిళ్ల కోనుగోళ్ల జోలికి వెళ్లడం లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రాష్ట్ర శాసన మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ గురించి టీడీపీ సభ్యుడు పి.అశోక్‌బాబు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ఇంటర్మీడియట్ విద్యార్థినులకూ సైకిళ్లను పంపిణీ చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. సైకిళ్ల ధర కర్నాటకలో 3674 రూపాయలు, తమిళనాడులో 3716 రూపాయలకు కొనుగోలు చేయగా, రాష్ట్రంలో అంతకన్నా ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేశారన్నారు. ఆ కొనుగోళ్ల జోలికి వెళ్లడం లేదన్నారు. పాఠశాలల్లో వౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉద్దేశించిన హైబ్రీడ్ యాన్యుటీ మోడ్ గురించి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడుగుతున్నారని తెలిపారు.
మంత్రి మాట్లాడుతున్న సమయంలో సైకిల్ మాది... స్టిక్కర్ మీది అని టీడీపీ సభ్యులు... ఆరోగ్యశ్రీ మాది.. పేరు మీది అని వైకాపా ఎమ్మెల్సీలు పరసర్పరం విమర్శలు చేసుకున్నారు. జగన్ తన పాదయాత్రలో ప్రతి మగ్గానికి రెండు వేల రూపాయలు సాయం చేస్తానని ప్రకటించారని, కానీ ఒక కుటుంబంలో 2, 3 మగ్గాలు ఉంటే ఏమి చేస్తారని టీడీపీ సభ్యుడు బచ్చుల అర్జునుడు ప్రశ్నించారు. మగ్గానికి అవసరమయ్యే విద్యుత్ బల్బు ఖర్చును ప్రభుత్వం భరిస్తుందా అని ప్రశ్నించారు. దీనిపై అంతా అగమ్యగోచరంగా ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి గౌతం రెడ్డి బదులిస్తూ, కుటుంబానికి రెండు వేలు అందచేస్తామన్నారు. ఇందుకు బడ్జెట్‌లో 200 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఇంకా 9 నెలల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.