ఆంధ్రప్రదేశ్‌

మేనరికాలపై విస్తృత ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 16: మేనరికం వివాహాల వల్ల పుట్టబోయే సంతానం జన్యు సంబంధ రుగ్మతలకు లోనవుతున్నారని, వివిధ వైకల్యాలతో జన్మించిన పిల్లలను పెంచలేక తల్లిదండ్రులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పెందుర్తి నియోజకవర్గం వేపగుంట ప్రాంతంలో ఇద్దరు దివ్యాంగ పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై ఆమె విశాఖలో మంగళవారం స్పందించారు. ఈ సంఘటన తనను ఎంతగానో కలచివేసిందని, మేనరిక సంబంధాల చేసుకోవడం వల్ల జన్యు సంబంధ ఇబ్బందులు తలెత్తుతాయని, తద్వారా శరీర వైకల్యంతో పుట్టే సంతానాన్ని పెంచలేక ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని అన్నారు. దీనిపై ఏపీ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా ప్రచారం కల్పిస్తామన్నారు. జన్యు సంబంధ రుగ్మతలతో జన్మించిన వారిని ప్రభుత్వ వసతి గృహాల్లో చేర్పిస్తే, అటువంటి వారి బాధ్యత మహిళా కమిషన్ తీసుకుంటుందన్నారు. మహిళలను విలన్లుగా టీవీ సీరియళ్లలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారంపై ఆమె ఘాటుగా స్పందించారు. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రపంచంలో భారత స్ర్తి అంటే ఎంతో గౌరవ భావం ఉందని, ఇటువంటి చౌకబారు టీవీ సీరియళ్ల వల్ల అది దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని నియంత్రించాలని కోరారు. కేంద్ర కారాగారాల్లో మహిళ పరిస్థితి దయనీయంగా ఉందని ఆమె అన్నారు. ఇటీవల తాము ఒక కారాగారాన్ని సందర్శించగా 39 మంది రిమాండ్, శిక్ష ఖరారైన ఖైదీలు ఉండగా వారిలో 19 మంది కేవలం గంజాయి స్మగ్లింగ్ కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. ఇంత మంది మహిళలు గంజాయి స్మగ్లింగ్‌లో ఖైదీలుగా ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. వీరు నిందితులుగా మారడం వెనుక ఎవరి హస్తమైనా ఉందా అన్న కోణంలో విచారణ జరిపించాలన్నారు. ఇదే కారాగారంలో 39 మంది మహిళా ఖైదీలు ఉండగా, కేవలం ఒక మహిళా వార్డర్ మాత్రమే ఉండటం గుర్తించామన్నారు. అంతకు ముందు ఆమె దివ్యాంగుల వసతిగృహాన్ని సందర్శించారు.
చిత్రం... విశాఖలో విలేఖరులతో మాట్లాడుతున్న ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి