ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 16: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈనెల 17న ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా వచ్చే మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు. ప్రతి ఏటా ఉగాది, దక్షిణాయనం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. తిరుమంజనం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి, మధ్యాహ్నం 12గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు. అనంతరం టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం 6 నుండి 11గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారన్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకుని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయంలోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేశారన్నారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును శే్వత వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచామన్నారు. శుద్ధి పూర్తి అయిన తరువాత నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర వాటితో తయారు చేసిన పరిమళ లేపనంతో ఆలయ గోడలకు సంప్రోక్షణ చేసినట్లు తెలిపారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించిన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంలో భాగంగా ధ్వజస్తంభాన్ని శుభ్రం చేస్తున్న చిత్రం... టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్