ఆంధ్రప్రదేశ్‌

దేశ సమగ్రత అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్/పొదిలి, మార్చి 24: ముష్కరులు దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు పాల్పడుతున్నారని, దేశ విచ్ఛిన్నతకు పాల్పడుతున్న ముష్కరులకు బుద్ధిచెప్పి సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని బిజెపి జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి దగ్గుపాటి పురంధ్రీశ్వరి అన్నారు. గురువారం స్థానిక పంచాయతీరాజ్ అతిథిగృహా ప్రాంగణంలో జరిగిన బిజెపి మార్కాపురం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో నివసిస్తూ వ్యాపారాలు కొనసాగించుకుంటున్న కొందరు ముష్కరులు పీకపై కత్తిపెట్టినా భారతమాతాకీ జై అనబోనని ప్రకటించడం వారి దేశద్రోహ చర్యలకు అద్దంపడుతుందన్నారు. భారతమాతాకీ జై అనే నినాదం ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి, సంఘపరివార్‌ల నినాదం కాదని, దేశ ఐక్యతకు పునాది వేసిన నినాదమని అన్నారు. భారతదేశాన్ని తల్లిగా భావించే ప్రతిఒక్కరూ భారతమాతాకీ జై అని నినదించాల్సి ఉందన్నారు. యూనివర్సిటీలలో విద్యార్థులు సమావేశమై దేశ విచ్ఛిన్నతకు పథకాలు రూపొందిస్తున్నారని, వారికి మరికొన్నిశక్తులు అండగా నిలుస్తున్నాయని అన్నారు. బిజెపి సమర్థవంతమైన పాలన అందిస్తుందని, దానిని జీర్ణించుకోలేని కొందరు పార్టీపై, పాలకనేతలపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, ఆ ప్రచారాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని అన్నారు.